ఆమె బయటకు రాగానే ఫొటో జర్నలిస్ట్‌లు ఫొటోలు తీయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును తప్పుగా పలికారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.
భారత చలన చిత్ర రంగంలో కేవలం స్టార్‌లకు మాత్రమే కాదు.. స్టార్‌ల పిల్లలకు కూడా పిచ్చ పాపులారిటీ ఉంటోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. బయట ఎక్కడకు వెళ్లినా వీళ్ల వెంట పడేవారు చాలా మందే ఉన్నారు. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటివి చాలా ఎక్కువ. పాపరజీలు స్టార్‌ల పిల్లల వెంటపడి మరీ ఫొటోలు తీస్తూ ఉంటారు. వారు ఇబ్బందిపడుతున్నా పట్టించుకోరు.
తాజాగా, బాలీవుడ్ స్టార్ దంపతులు అజయ్ దేవ్‌గణ్, కాజోల్‌ల కూతురు నిసా దేవ్‌గణ్‌ను పాపరజీలు ఇబ్బంది పెట్టారు. ఆమె పేరును తప్పుగా పలకటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. నిసా దేవ్‌గణ్ తాజాగా, ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. పని ముగించుకుని బయటకు వచ్చిన ఆమెను పాపరజీలు ఫొటోలు తీయటం మొదలుపెట్టారు. ఆమె నవ్వుతూ.. వారి వైపు చూస్తూ అక్కడినుంచి తన కారు ఉన్న చోటుకు నడవసాగారు. ఈ నేపథ్యంలోనే కొందరు పాపరజీలు ‘‘ నైసా.. నైసా’’ అంటూ ఆమెను పిలవటం మొదలుపెట్టారు. ఆమె అవేవీ పట్టించుకోకుండా కారులోకి వెళ్లారు.
ఆ వెంటనే ‘‘ నా పేరు నిసా’’ అంటూ నవ్వుతూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో పాపరజీలు ఆమెకు సారీ చెప్పారు. నిసా కారు అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆమె పేరు నిసా అంట.. నైసా కాదు..’’.. ‘‘ ఫొటోల కోసం వచ్చినపుడు పేరు సరిగ్గా తెలుసుకుని రావాలి’.. ‘‘ సెలెబ్రిటీల పిల్లలకు కొంచెం పొగరు ఎక్కువ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, తన పేరు తప్పుగా పలికారని ఫొటో జర్నలిస్ట్‌లపై నిసా మండిపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.