టాలీవుడ్ లో రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. . నిన్న(మే 20) న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. సింహాద్రి సినిమాని మరో సారి తెరపైన చూసుకునే భాగ్యం అభిమానులకి దక్కింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. సింహాద్రి వసూలు విషయంలో తన సత్తా చూపించాడు.అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ పోకిరీ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తే చాలు రీ- రిలీజ్ పక్కా అనేట్లుగా మారిపోయింది మన తెలుగు సినిమా పరిస్థితి. ఒక రకంగా అభిమానులకి ఇదొక పెద్ద గిఫ్ట్ లాంటిదే. తమ హీరోల పాత సినిమాలు మరోసారి తెర మీద చూసుకోగానే ఎక్కడ లేని ఆనందంతో పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. తాజాగా.. నిన్న(మే 20) న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. సింహాద్రి సినిమాని మరో సారి తెరపైన చూసుకునే భాగ్యం అభిమానులకి దక్కింది. అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది.
బాక్స్ ఆఫీస్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెనిఫిట్ షో దగ్గర నుండే ఈ హడావుడి కనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ రిలీజై ఏడాది దాటిపోయింది. కొరటాల దర్శకత్వంలో చేయబోయే దేవర సినిమా కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వరకు ఆగాలి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సింహాద్రి సినిమా రీ- రిలీజ్ రూపంలో అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది. 2003 లో వచ్చిన ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. అప్పటికే ఆది సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న ఎన్టీఆర్.. సింహాద్రి సినిమాలో విశ్వరూపమే చూపించాడు. అప్పట్లో ఈ 20 ఏళ్ళ కుర్రాడి దాటికి రికార్డులన్నీ చెల్లా చెదరైపోయాయి. పట్టుమని పాతికేళ్ళు లేకుండానే బాక్స్ ఆఫీస్ మీద దండ యాత్ర చేసి తన శకాన్ని మొదలు పెట్టాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. సింహాద్రి వసూలు విషయంలో తన సత్తా చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే 3.5 కోట్లు వసూలు చేసి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ఒక్క విషయంలో కాస్త సంతోషంగా లేరని తెలుస్తుంది. ఇప్పటివరకు తొలి రోజు వసూళ్ల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి 4 కోట్ల వసూల్ రాబట్టింది. రీ-రిలీజ్ ట్రెండ్ లో ఇప్పటివరకు ఖుషి సినిమానే టాప్ లో ఉండడం విశేషం. ఈ సినిమాని సింహాద్రి సినిమా దాటలేకపోయింది. మొత్తానికి పుట్టిన రోజుకి ముందు “దేవర” సినిమా ఫస్ట్ లుక్ ..బర్త్ డే రోజు సింహాద్రి రీ- రిలీజ్ ఇలా డబల్ ధమాకాతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు ఎన్టీఆర్.