ఎన్టీఆర్ పాటకు స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. చిన్న బిట్ ప్లే చేయగానే ప్రేక్షకుల్లో చాలామంది అరిచి గోలగోల చేశారు. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఏం చేసినా సరే అది సెన్సేషన్ గా మారుతోంది! రీసెంట్ గా ‘ఆస్కార్’ కోసం యూఎస్ వెళ్లిన తారక్.. అక్కడి అభిమానులతో కలిసి తెగ సందడి చేశాడు. కొన్నాళ్ల ముందు ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఏకంగా హాలీవుడ్ లోనే మాట్లాడుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు మనోడి పాటకు స్టేడియం స్టేడియమే దద్దరిల్లిపోయింది. అలా అని ఇది మొత్తం పాటేం కాదు.. జస్ట్ కొన్ని సెకన్ల మ్యూజిక్ బిట్ కే ప్రేక్షకులు అరిచి రచ్చ రచ్చ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం నాలుగేళ్లు తీసుకున్న ఎన్టీఆర్, తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి ఏడాది టైం తీసుకున్నాడు. అలా కొరటాల శివతో మూవీని రీసెంట్ గానే ప్రారంభించాడు. అంతకు కొన్నాళ్ల ముందు ‘వస్తున్నా..’ అని మ్యూజిక్ వీడియో టీజర్ ని రిలీజ్ చేశారు. దానికి అప్పట్లో తెగ క్రేజ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కావడం వల్ల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పుడవన్నీ చాలవన్నట్లు యూఎస్ లోని న్యూజెర్సీలో అనిరుధ్ ఓ కన్సర్ట్ లో పాల్గొన్నాడు. అందులో భాగంగానే NTR30 థీమ్ సాంగ్ ని ప్లే చేయగా.. అక్కడున్న ప్రేక్షకులు అరిచో గోలగోల చేశారు.
అప్పటివరకు అనిరుధ్ మిగతా పాటలు ప్లే చేస్తూ రాగా.. ఆడియెన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అలాంటిదిగా సడన్ గా ఎన్టీఆర్ సాంగ్ వినిపించేసరికి అందరూ అలెర్ట్ అయిపోయారు. రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గాల్లో తేలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. వచ్చే ఏప్రిల్ 5న సినిమా వచ్చిన తర్వాత ఇంకేమైపోతారో అనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఎన్టీఆర్ పాటకు యూఎస్ లో స్టేడియం దద్దరిల్లిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#ntr30
New jersey 🔥
pic.twitter.com/KCWH4TqrxE— Anirudh Telugu Official (@Anirudh_telugu) April 2, 2023