యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో మూవీ 'NTR30'. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో రెండోసారి సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని, సినిమా స్క్రిప్ట్ ని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడట కొరటాల. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో విలన్ ఎవరనేది సినీ వర్గాలలో, ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో మూవీగా ‘NTR30‘ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో రెండోసారి సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ వీరి కలయికలో “జనతా గ్యారేజ్” మంచి విజయాన్ని అందుకుంది. అయితే.. ఇప్పటికే ఎన్టీఆర్30 నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. షూటింగ్ ఇంకా మొదలుకాని ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా పూజా కార్యక్రమంతో ఫిబ్రవరి 24న గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆచార్య మినహాయించి దర్శకుడిగా ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన కొరటాల.. ఈసారి ఎన్టీఆర్ ని ఊరమాస్ రేంజ్ లో చూపించనున్నాడని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని, సినిమా స్క్రిప్ట్ ని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడట కొరటాల. ఓవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుపుకుంటోంది. కాగా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతానికి వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో విలన్ ఎవరనేది సినీ వర్గాలలో, ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇందులో విలన్ ఎవరు అనే విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పోట్లాడే విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడని వినికిడి. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. కాగా.. మొన్నటిదాకా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ.. ఆఖరికి మేకర్స్ సైఫ్ ని ఓకే చేశారని తెలియడంతో దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్30లో సైఫ్ అలీఖాన్ పేరు వినిపించేసరికి.. బాలీవుడ్ ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆల్రెడీ హీరోగా ఫామ్ లో ఉన్న అక్షయ్ కుమార్.. తమిళంలో రోబో 2 చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో సైఫ్ ఎంట్రీ ఇస్తే.. ఆయన్ని విలన్ గా ఊహించుకోవడం కష్టమని ఫ్యాన్స్ అంటున్నారట. ఆల్రెడీ సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ లో రావణ్ గా నటిస్తున్నాడు. అదంటే మైథాలజీ మూవీ. కానీ, ఎన్టీఆర్ కి విలన్ గా అంటే.. ఎన్టీఆర్ నటనకు మ్యాచ్ చేయగలడా? ఎన్టీఆర్ కి సైఫ్ సరైన విలనేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఎన్టీఆర్ నటన ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత్ర ఎలాంటిదైనా అందులో పరకాయ ప్రేవేశం చేసి అద్భుతమైన రిజల్ట్ రాబట్టగలడు. అంతకుముందు తెలుగు వరకే పరిమితమైనా.. ఈ విషయం గతేడాది ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా వైడ్ ప్రూవ్ అయ్యింది. మరి అలాంటి ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ విలన్ అంటే.. కథలో ఆ స్థాయి స్కోప్ ఉందేమో కాబోలు. సో.. కథలో దమ్ము ఉన్నప్పుడు సైఫ్ విలన్ గా చేయడంలో అభ్యంతరం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో ఓ మాసివ్ మూవీ చేయనున్నాడు. మరి ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా ఓకే అయితే తెరపై వీరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.