టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. #NTR 30 పేరుతో ఉన్న ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల కొరటాల శివ తెరపైకి వచ్చాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను ఓకే చేశారు. కొరటాలతో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు.
అలాగే ఎన్టీఆర్ అత్త బిజెపి మహిళా నేత పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా మీరు చాలా ప్రత్యేకమైన వారు. అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు పురందేశ్వరి. ఇంకా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అంతా కూడా సోషల్ మీడియాలో మొన్నటినుంచి హంగామా స్టార్ట్ చేశారు. ఇక నిన్నటి నుంచి హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.