నందమూరి కుటుంబలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం చెందారు. దీంతో.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో.. నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ కూడా విషయం తెలిసిన వెంటనే తన పిన్ని ఇంటికి చేరుకున్నారు.
ఇక ఉమా మహేశ్వరి ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఆ సమయంలోనే చంద్రబాబు – దగ్గుబాటి ఫ్యామిలీలను కలుసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొంతకాలంగా ఉమామహేశ్వరి ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ కి చిన్న కుమార్తె అయినటువంటి ఉమా మహేశ్వరి జాబ్లీహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ ఉదయం బాగానే ఉన్నారని.. సడన్ గా గుండె నొప్పితో కుప్ప కూలారని అంటున్నారు. కానీ.. తాజా సమాచారం ప్రకారం ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. మరి ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలుస్తుంది.
ఉమామహేశ్వరీ మానసిక ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఉమా మహేశ్వరి మరణంతో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కక్కొరుగా ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటికే వచ్చారు. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కి సమాచారం అందించారు. ఎన్టీఆర్ కుమార్తెల్లో ఉమామహశ్వరి చిన్నవారు. ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉన్నవారంతా ఉమా మహేశ్వరి నివాసానికి తరలి వస్తున్నారు.
ఎన్టీఆర్ కూతుర్లలో దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు. ఆమె రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రెండో కూతురు చంద్రబాబు నాయుడు భార్య అయినటువంటి భువనేశ్వరి. మూడో కూతురు లోకేశ్వరి. చివరి కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి. ఎన్టీఆర్ ఏడుగురు కుమారుల్లో జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ. మరి ఉమామహేశ్వరీ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.