హీరో ఎన్టీఆర్.. మొన్నటివరకు మహా అయితే దక్షిణాది రాష్ట్రాలకు వరకు తెలుసోమో. ఇప్పుడు ఆలోవర్ వరల్డ్ లోనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నీ మధ్య ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లోనూ ఉంటాడనుకున్నారు గానీ కొద్దిలో మిస్ అయింది. లేదంటే మాత్రం టాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యేది. ఇక తారక్ సినిమాల గురించి గత ఏడాది నుంచి ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త మాత్రం యమ క్రేజీగా ఉంది.
ఇక విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా చేయాలని చాలామంది డైరెక్టర్స్ అనుకుంటారు. కానీ అన్నీ సెట్ కాకపోవచ్చు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ అని మొన్నమొన్నటి వరకు తారక్ బిజీగానే ఉన్నాడు. తాజాగా ‘అమిగోస్’ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా విశేషాలు వెల్లడించాడు. ఫిబ్రవరిలో పూజ, మార్చి నుంచి షూటింగ్.. 2024 ఏప్రిల్ 5న సినిమా రిలీజ్. ఈ సినిమాను సెప్టెంబరు-అక్టోబరులో పూర్తిచేసి.. ప్రశాంత్ నీల్ తో కలిసి #NTR31 కోసం పనిచేయనున్నాడు. ఇకపోతే ఈ ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు వీళ్ల కాంబో గురించి మరో వార్త వినిపిస్తుంది.
అది ఏంటంటే.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఒకటి కాదు వరసపెట్టి రెండు భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయట. వీటిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ యాక్షన్ జానర్ స్టోరీస్ అని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులే కాదు తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడనే వార్త వినిపిస్తోంది. రెండు భాగాలుగా తీస్తున్న ఈ ప్రాజెక్టులో తొలి పార్ట్ లో తారక్, రెండో పార్ట్ లో ధనుష్ హీరోలుగా నటిస్తారనే గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. ఎంతో కొంత నిజం లేకపోతే.. ఈ న్యూస్ అయితే రాదు కదా! సో అదన్నమాట విషయం. వినిపిస్తున్న సమాచారం వరకు ఎన్టీఆర్ తన లైనప్ ని బాగా స్ట్రాంగ్ గా రెడీ చేస్తున్నాడు. ఒకవేళ ఇవే నిజమైతే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ కు బ్యాండ్ గ్యారంటీ. మరి తారక్-ప్రశాంత్ నీల్.. వరసగా రెండు సినిమాలు చేస్తారనే దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.