ఇండస్ట్రీలో నాన్నకు ప్రేమతో అన్నా, అన్నయ్యకు ప్రేమతో అంటూ సహాయం చేయడానికి ముందుకి వచ్చినా అది ఒక్క యంగ్ టైగర్ యన్టీఆర్ కి మాత్రమే సాధ్యం. ఎంత మంచి వాడవురా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ బింబిసార. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో, పీరియాడిక్ సోషియో ఫాంటసీ స్టోరీతో వస్తున్న ఈ మూవీని ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గతంలో ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ టచ్ చేయని కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఇంత రిస్క్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా తెరపైకి వచ్చింది.
ఈప్రాజెక్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. అన్నయ్య కళ్యాణ్ రామ్ తో యన్టీఆర్ కి మొదటినుంచి మంచి అనుబంధమే ఉంది. ఇక వారి తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఇది మరింత బలపడింది. సినిమాల పరంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో కళ్యాణ్ రామ్ లాస్ లో ఉన్నపుడు అన్నయ్య కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ‘జై లవకుశ’ సినిమా చేసి ఆర్థికంగా ఆదుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ’ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కళ్యాణ్ రామ్ ని నిర్మాణ భాగస్వామిగా ఉండేలా సినిమాలు ఓకే చేస్తున్నారు తారక్.
ఈ క్రమంలో స్వయంగా తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా కోసం మరో రూపంలో రంగంలోకి దిగనున్నాడట జూనియర్ ఎన్టీఆర్. బింబిసార సినిమాకు సంబంధించి కథను పరిచయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఎన్టీఆర్ రామ్ హీరోగా నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకు కూడా వాయిస్ ఓవర్ అందించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ సినిమాకు తన గాత్రాన్ని అందిస్తున్నారు. ఏదేమైనా అన్నయ్య కళ్యాణం కోసం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ పడుతున్న ఆరాటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.