ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అంతకంటే ముందు ఫ్యాన్స్ ని కలిశాడు. తన స్పీచ్ తో అందరినీ ఎమోషనల్ చేసేశాడు.
మన దేశం గర్వించదగ్గ సినిమాల్లో RRRది ప్రత్యేక స్థానం. ఈ సినిమా రిలీజ్ దగ్గర నుంచి ఎవరో ఒకరు ప్రశంసిస్తూనే ఉన్నారు. ఈ సినిమాలోనే “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అందరి దృష్టి ఈ పాట మీదే ఉంది. మార్చ్ 12 న లాస్ ఏంజెల్స్ లో 95 వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్ గా జరగబోతుంది. దీంతో ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, కార్తికేయ ఇక్కడికి చేరుకోగా తాజాగా ఎన్టీఆర్ కూడా వీరితో జాయిన్ అవుతున్నాడు. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశాడు. అభిమానుల చూపిస్తున్న ప్రేమకు ఎమోషనల్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గానే కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ప్రపంచంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా అమెరికాలోనే తన ఫ్యాన్స్ ని కలుసుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అభిమానులు కోలాహలంతో తారక్ సంతోషంతో ఉప్పొంగిపోయి భావోద్వేగంతో ఫ్యాన్స్ తో కాసేపు మాట్లాడాడు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు తట్టుకోలేకపోయాడు. ఫ్యాన్స్ చేసిన సందడి చూసి వాళ్ల గురించి చాలా అద్భుతంగా మాట్లాడాడు.
‘నా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు 100 రెట్ల అభిమానం నా గుండెల్లో ఉంది. కాకపోతే నేను చూపించలేకపోతున్నాను. మీరు చూపిస్తున్న అభిమానాకి బహుశా పదాలు కనిపెట్టలేదు. మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు. అయినా నేనేం చేసి మీకు దగ్గరయ్యానో తెలియడం లేదు. మనది రక్త సంబంధం కంటే గొప్ప బంధం. నా సోదరులకంటే కూడా నాకు మీరే ఎక్కువ. ఎన్ని జన్మలైనా మీలాంటి అభిమానులని పొందాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్ధం కావడం అందుకే శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నాను’ అని ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. అనంతరం ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్స్, వారితో ఫోటోలు దిగడం లాంటివి చేస్తూ తారక్ సందడి చేశాడు. మరి ఎన్టీఆర్ స్పీచ్ మీకెలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.