తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం వేరనే చెప్పాలి. తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటాడు తారక్. ఇటీవల తారక్ నటించిన RRR మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ తన మనసులో కోరికలను బయటపెట్టాడు.
RRR మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. ఇక యాంకర్ ఇలా అడుగుతూ.. మీరు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో సీక్వెల్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారని ప్రశ్నించాడు. అస్సలు ఆలోచించకుండా ఎన్టీఆర్ అదుర్స్ మూవీ చేస్తానంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో అదుర్స్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఇది కూాడా చదవండి: ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన RRR.. మూడు రోజుల్లోనే అరుదైన ఫీట్!
అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించి మంచి రికార్డును నెలకోల్పింది. ఈ సినిమా సీక్వెల్ కు డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మరి నిజంగానే ఎన్టీఆర్ అనుకున్నట్లు అదుర్స్ మూవీ సీక్వెల్ చేస్తారో లేదో చూద్దాం. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.