‘RRR’ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా అది యూట్యూబ్ సెన్సేషన్ అవుతుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ మల్టీ స్టారర్ RRR సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబో ప్రాజెక్టు ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. నవంబరు 10 మధ్యాహ్నం 3 గంటలకు విడుదలైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్‌లో రెండ్రోజుల్లోనే 11 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్ 1లో కొనసాగుతోంది. ఈ సాంగ్‌కు సంబంధించి మరో విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సాంగ్‌ను నార్మల్ స్పీడ్‌లో కాకుండా యూట్యూబ్‌లో 0.5 స్పీడుతో చూస్తే కొత్త ఎక్సిపీరియన్స్ వస్తుందంటూ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య స్పీడ్ సాంగ్స్‌ను స్లోగా, స్లో సాంగ్స్‌ను యూట్యూబ్‌లో స్పీడుగా చూడటం అలవాటు చేసకున్నారు. ఈ ధోరణిలోనే నాటు నాటు సాంగ్‌ను 0.5 స్లోగా చూసినా కూడా అది నార్మల్ సాంగ్‌ని చూసినట్లే ఉందంటూ చెబుతున్నారు. అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ అంత స్పీడుగా డాన్స్ చేశారు. వాళ్లు చేసిన డాన్సు స్లో మోషన్‌లో నార్లమ్ కనిపిస్తోందనమాట. మీరు గ్రేట్ సార్ అంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరి ఆ ట్రిక్ ఏదో మీరు కూడా ట్రై చేయండి.