ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి హోంఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. తన కోసం ఎవరు కంగారు పడవద్దని ఇప్పటికే ఎన్టీఆర్ చెప్పారు. ఇక ఇప్పుడు తన అభిమానులకు ఎన్టీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఏవిధమైన వేడుకలు చేయవద్దని ఎన్టీఆర్ లేఖలో పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకలకు ఇది ఏమాత్రం సరైన సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ఆంక్షలను పాటించి ఇంట్టోనే ఉండాలని, భహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచించారు.
ఇక ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని లేఖలో ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. అంతే కాదు బాలీవుడ్, హాలీవుడ్ నటీ నటులు చాలమంది ఆర్ ఆర్ ఆర్ లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.