ఎన్టీఆర్-కొరటాల సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి జాన్వీ కపూర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ జోడీ విషయంలో బాలయ్య రియాక్షన్ ఏంటో? ఇంతకీ అసలు విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మొన్నీ మధ్య హైదరాబాద్ వచ్చిన ఈ భామకు సంబంధించిన ఫొటోషూట్ కూడా అయిపోయిందని టాక్ వచ్చింది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే.. టాలీవుడ్ లోకి జాన్వీ ఎంట్రీ క్లియర్ అయిపోయినట్లే. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి నటిస్తే.. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ పక్కన ఆమె కూతురు జాన్వీ నటిస్తోందనేసరికి ఫ్యాన్స్ లో చిన్న క్యూరియాసిటీ. జంట ఎలా ఉండబోతుంది? వాళ్లని మరిపిస్తారా లాంటి చాలా డౌట్స్ వస్తాయి. అదే టైంలో నందమూరి ఫ్యాన్స్ బాలయ్యకు వచ్చిన కష్టం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 80,90స్ లో సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ‘బడి పంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత 16 ఏళ్లకు ఆయన పక్కనే హీరోయిన్ గా చేసి సూపర్ జోడీ అనిపించుకుంది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్-శ్రీదేవి జంటగా పలు హిట్ సినిమాలు చేసి సూపర్ హిట్ జోడీ అని పించుకున్నారు. అయితే బాలయ్యతో రాఘవేంద్రరావు ‘సామ్రాట్’, కోదాండరామిరెడ్డి ‘భలే దొంగ’ సినిమాలు తీశారు. ఇందులో హీరోయిన్ శ్రీదేవినే పెడదామనుకున్నారు. కానీ అటు ఎన్టీఆర్, ఇటు నందమూరి ఫ్యాన్స్.. శ్రీదేవి జోడీగా నటించొద్దని సూచించడంతో బాలయ్య వెనక్కి తగ్గారు.
అలా శ్రీదేవి, బాలయ్యతో తప్ప దాదాపు అప్పట్లో తెలుగు స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది. అయితే ‘తండ్రి పక్కన నటించిన శ్రీదేవి అంటే తనకు తల్లితో సమానం.. నేను ఆమెతో నటించను’ అని బాలయ్య అప్పట్లో అన్నారని అందుకే బాలకృష్ణ-శ్రీదేవి జోడీ సెట్ కాలేదనేది కూడా మరో వెర్షన్. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బాలయ్యకు చిన్న సైజ్ కష్టం వచ్చినట్లే. ఎందుకంటే తారక్ ‘NTR30’ సినిమాలో జాన్వీ ఫిక్స్ అయిపోయింది. తాజాగా NTR30 నుండి జాన్వీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ మూవీ గురించి ఎప్పుడైనా ఆయన మాట్లాడాల్సి వచ్చి, శ్రీదేవి విషయం అడిగితే బాలయ్య ఎలా స్పందిస్తారనేది ఇంటరెస్టింగ్ పాయింట్. కాగా ఎన్టీఆర్30 మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తూనే.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి జోడీని విశేషంగా ఆదరించిన ప్రేక్షకులు.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ జోడీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి! మరి ఎన్టీఆర్ – జాన్వీ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Awaited Prestigious Pan Indian Project @tarak9999‘s #NTR30 Pooja Ceremony on February 24th 🕺❤️🔥🥳. #KoratalaSiva #ManOfMassesNTR #jahnvikapoor @anirudhofficial pic.twitter.com/iTQoLQfMJR
— tarak the ruler 9999 (@globalherontr) February 13, 2023