NTR30 షురూ అయింది. హైదరాబాద్ లో జరిగిన వేడుకతో అంగరంగ వైభవంగా సినిమాను ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో మిగతా వాళ్ల సంగతేమో గానీ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ఫొటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ కొట్టి, గ్లోబల్ వైడ్ యమ క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. 2018లో ‘అరవింద సమేత’.. 2022లో ‘ఆర్ఆర్ఆర్’. వీటి తర్వాత తారక్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. గత నెలలోనే NTR30 స్టార్ట్ కావాల్సినప్పటికీ.. తారకరత్న అకాల మరణంతో అది కాస్త వాయిదా పడింది. ఫైనల్ గా ఇప్పుడు అంటే గురువారం(మార్చి 23) కొత్త సినిమా షురూ అయింది. హైదరాబాద్ లో గ్రాండ్ గా పూజా కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ తోపాటు పలువురు నటీనటులు విచ్చేసి సందడి చేశారు. అయితే ఒక్క ఫొటో మాత్రం మొత్తం సోషల్ మీడియాకే స్పెషల్ గా నిలిచింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’తో తన రేంజ్ ని ఓ రేంజ్ లో పెంచేసుకున్న ఎన్టీఆర్, తర్వాతి సినిమా విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేసినట్లున్నారు. అందుకే దాదాపు ఏడాది సమయం తీసుకుని మరీ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. తనతో ‘జనతా గ్యారేజ్’ తీసి హిట్ కొట్టిన కొరటాల శివనే ఈ కొత్త చిత్రానికి డైరెక్టర్. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. NTR30 ప్రారంభ వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె.. ఎన్టీఆర్ ని ఆప్యాయంగా పలకరించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోనే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా ఆకుపచ్చ చీరలో కనువిందు చేసిన జాన్వీ.. ఎన్టీఆర్ తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. ఒక్క ఫ్రేమ్ లో ఇలా ఇద్దరూ కనిపించేసరికి అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు. నార్మల్ గా ఈ పెయిర్ ఇంతా బాగుందంటే.. సినిమాలో ఇంకెంతలా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అనిరుధ్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అవుతుందని చెప్పారు. చూడాలి మరి NTR30 ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో? సరే ఇదంతా పక్కనబెడితే ఎన్టీఆర్-జాన్వీ కపూర్ పిక్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
Pic of the day❤🤩💥 #NTR30 #NTR30Begins 🔥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @NTRArtsOfficial pic.twitter.com/1TWvaG3Mv2
— SumanTV (@SumanTvOfficial) March 23, 2023