జిమ్‌లో రెగ్యులర్ వర్క్అవుట్స్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కుడిచేతికి గాయ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ గాయానికి సర్జరీ కూడా చేయించుకున్నట్లు ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ ఫొటోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్టీఆర్ కుడి చేతికి కట్టుకట్టి ఉంది. తన ఎన్టీఆర్ గాయపడ్డారా అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఎన్టీఆర్ చేతికి గాయం అయిన విషయం నిజమేనని సమాచారం. జిమ్‌లో తారక్ చేతి వేలికి గాయమైనట్లు, ఆసుపత్రిలో చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని తెలుస్తుంది. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని, ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.