ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసిన మల్టీస్టారర్ కావడంతో RRR పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
మార్చి 25న RRR ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణితో కలిసి ఎన్టీఆర్, చరణ్ ఓ సరదా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి మాట్లాడుతూ.. “టాప్ యాంకర్ సుమకు మీ సినిమాల్లో ఏదైనా రోల్ ఇవ్వాల్సి వస్తే ఏ రోల్ ఇస్తారు?” అని ఎన్టీఆర్, చరణ్ లను అడిగాడు. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ.. ‘సుమకు నాయనమ్మ, అమ్మమ్మ రోల్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది కదా.. సుమను చూడగానే గయ్యాళి అత్త, ముసలావిడలా అనిపిస్తుంది.ఇదివరకు మనకు ఛాయాదేవీ, సూర్యకాంతం, నిర్మలమ్మ అలాంటి రోల్స్ చేశారు. పైగా సుమకి చాదస్తం కూడా ఎక్కువ. నోరేసుకుని పడిపోతుంది. కాబట్టి అలాంటి రోల్ అయితే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సుమ గురించి చరణ్ మాట్లాడుతూ.. ‘ఓ పంచాయతీ పెద్దమనిషి(మధ్యవర్తి)గా అయితే బాగుంటుంది’ అన్నాడు. ఎన్టీఆర్, చరణ్ మాట్లాడిన వీడియో పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మరి ఎన్టీఆర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.