RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూ.ఎన్టీఆర్.. మరో సినిమాకు సిద్ధమయ్యారు. ‘NTR30’లో నటించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులవుతుంది. ఇటీవల చిత్ర ప్రీ లుక్ పేరుతో సినిమా థీమ్‌ని తెలిపేలా ఓ గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అలియాభట్, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికే.. ఇంకా క్లారిటీ లేదు.
మరోవైపు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు తారక్. ‘NTR31’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని కూడా త్వరగా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమాని మొదలెట్టనున్నారు ప్రశాంత్ నీల్. దాదాపు.. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ దీన్ని స్టార్ట్ చేయనున్నారు. ఇక కొరటాల శివ చిత్రంలో హీరోయిన్ల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త ఆలోచనలకు తెరలేపారు. వారే హీరోయిన్‌ని సజెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘NTR30’ చిత్రానికి హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందో చెప్పుకొచ్చారు. ‘కేజీఎఫ్2’ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు ‘NTR31’లోను శ్రీనిధి శెట్టినే హీరోయిన్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా పోస్ట్ లు పెడుతూ నానా రచ్చ చేస్తున్నారు.
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022
ఇది కూడా చదవండి: RRR World Record: ప్రపంచంలోనే నెంబర్ వన్ మూవీగా ‘RRR’ కొత్త రికార్డు..!
‘కేజీఎఫ్’ సినిమాతో శ్రీనిధిశెట్టి వెండితెరకి పరిచయమైంది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ రెండు సిరీస్ లు విడుదలయ్యేంత వరకు ఆమె మరే సినిమాకి సైన్ చేయలేదు.ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’ సంచలన విజయం సాధించడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి.. విక్రమ్ హీరోగా రూపొందిన `కోబ్రా` చిత్రంలో నటిస్తోంది. అదే సమయంలో `కేజీఎఫ్` లాంటి పాన్ ఇండియా సినిమా హీరోయిన్ ఇంకా కొత్త సినిమాలు ప్రకటించకపోవడం ఏంటనేది డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి.
And then with @prashanth_neel pic.twitter.com/cUBWeSoxfW
— Jr NTR (@tarak9999) May 20, 2022
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: రష్మిక అందాలను దాయలేకపోయిన బ్లాక్ డ్రెస్! ఫోటోలు వైరల్!
మరి తారక్ ఫ్యాన్స్ కోరికను ప్రశాంత్ నీల్ పట్టించుకుంటాడా? శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేస్తారా? లేక మరో హీరోయిన్‌తో ముందుకెళ్తారా? ఎన్టీఆర్ 31వ సినిమాకైనా హీరోయిన్ల ఎంపిక ఫాస్ట్ గా జరుగుతుందా? లేక కొరటాల సినిమా మాదిరిగానే జరుగుతుందా ? అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ (కళ్యాణ్ రామ్) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తారక్ కు జోడీగా.. శ్రీనిధి శెట్టిని తీసుకోవాలనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Pov: The king taking pictures of her queen on throne❤
The heavenly one: Rocky❣Reena#KGFChapter2 #kgf2 #KGFChapter3 #Salaar #Yash19 #YashBOSS𓃵 #SrinidhiShetty pic.twitter.com/hrOZxEXaeL
— PRAKRITI SHUKLA (𝕻𝖗𝖆𝖐𝕾) (@_PrakS_16) May 23, 2022