శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి కూడా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి కూడా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి మూవీని పలు థియేటర్స్ లో షోలు వేశారు. ఇక సింహాద్రి సినిమాను చూడటానికి ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకి వస్తున్నారు. అంతేకాక థియేటర్ల ముందు బాణ సంచా కాల్చుతూ తెగ సందడి చేశారు. అయితే ఒకచోట మాత్రం ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజైంది. 20 యేళ్ల తర్వాత ఈ సినిమాను 4K క్వాలిటీతో థియేటర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అయితే అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్లైన్ కూడా భారీ ఎత్తున సాలిడ్ సెలెబ్రేషన్స్ తో మోత మోగుతుంది. ఇక ‘దేవర’ గా తారక్ అభిమానులకు మాస్ ఫీస్ట్ అందించాడు. ఇక శనివారం తన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘సింహాద్రి’ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ కి మరో పండుగ అందించాడు. ఇక ఈ సినిమాను చూసేందుకు తారక్ అభిమానులు థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. అంతేకాక థియేటర్లలో ఈలలు వేస్తూ తెగ సందడి చేశారు.
ఇక థియేటర్స్ లోని స్క్రీన్ల ముందు డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇక తారక్ కనిపించి ప్రతిసారి.. పేపర్లు వేస్తూ, విజిల్స్ కొడుతూ హంగామా చేశారు. ఇక యూకేలోని వెస్ట్ లండన్ లో మాత్రం తారక్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వెస్ట్ లండన్ లోని ఓ థియేటర్లో సింహాద్రి సినిమాను ఆడించారు. ఈ సందర్భంగా అభిమానులు థియేటర్లో క్రాకర్స్ పేల్చారు. దీంతో అవి కాస్తా తెరపై పడి.. దానికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక సారి మంటలు రావడంతో భయందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Zoodharula athi uthsaham
Theatre lopala crackers pelcharu
Screen thagalapadi fire & smoke..
Hounslow UK #Simhadri4k #Simhadri pic.twitter.com/7j1qGSCTSf— MAD MAX (@AlWaYsPaWwAn) May 20, 2023