ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ పాన్ ఇండియా మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన ఈ సినిమాలో.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.
సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటినుండి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో, ఇటు రాంచరణ్ ఫ్యాన్స్ లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరు బాగా నటించారు? అనేది సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే.. గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలలో చరణ్ నటన అదరగొట్టేశారు. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరి నటన ప్రతి ఫ్రేమ్ లో హైలైట్ అయింది.
చదవండి: RRR మూవీ రివ్యూ!
ముఖ్యంగా టైటిల్ కి తగ్గట్టుగా రౌద్రం, రుధిరం, రణం అనే అంశాలలో ఇద్దరూ ఒకరికి ఒకరు పోటీలా చూపించాడు దర్శకుడు. అంతేగాక ఫ్రెండ్ షిప్, ఎమోషనల్ మూమెంట్స్, ఫైట్స్ లో వీరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే.. రాజమౌళి ముందు చెప్పినట్లుగానే చరణ్ ని ఫైర్ లా, ఎన్టీఆర్ ని వాటర్ స్వభావం కలిగిన విధంగా కూల్ గా చూపించాడు. కానీ ఎప్పుడైతే ఇద్దరిలో ఎమోషన్స్ రైస్ అవుతాయో యాక్షన్ ఫ్యాన్స్ కి ఐ-ఫీస్ట్ అనే చెప్పాలి.
ఈ క్రమంలో చాలామందికి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ని, సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ ని హైలైట్ చేశాడని.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇదంతా కాదు.. సినిమాలో ఏ టైంకి ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవ్వాలో.. ఆ విధంగానే సమాన న్యాయం చేస్తూ వచ్చాడు రాజమౌళి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ.. ఒకరిని ఒకరు డామినేట్ చేశారు.. కరెక్ట్ కాదని ప్రేక్షకులు అంటున్నారు. ఇద్దరికీ ఎక్కడ స్కోప్ ఇవ్వాలో అక్కడ స్పేస్ ని రాజమౌళి బాగా వినియోగించుకున్నాడు. ఇక ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అంటే.. ఇద్దరూ వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మరి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.