పాన్ ఇండియా మూవీ ‘RRR‘ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అగ్రదర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ పీరియాడిక్ మల్టీస్టారర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు గ్యాప్ లేకుండా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిట్ చాట్ లో పాల్గొన్నారు రాజమౌళి, తారక్, చరణ్. ఈ క్రమంలో ఎంతో సరదాగా సాగిన ఇంటర్వ్యూలో RRR కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే.. డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. ‘మీ ఇద్దరికి ఎప్పుడైనా షూటింగ్ సమయంలో ఒకరి క్యారెక్టర్ మరొకరికి మార్చుకోవాలని అనిపించిందా?’ అని చరణ్, తారక్ లను అడిగాడు.ఈ ప్రశ్నకు స్పందించిన తారక్.. ‘మా క్యారెక్టర్స్ ఫ్లిప్ చేయాలని అనిపించలేదు. కానీ రాజమౌళిని నా ప్లేస్ లోకి, నేను మానిటర్ దగ్గర రాజమౌళి ప్లేస్ లోకి వెళ్లాలని అనిపించింది. కానీ ఆ ఛాన్స్ దొరకలేదు’ అన్నాడు. ఇక చరణ్ స్పందిస్తూ.. ‘నాకు కూడా అనిపించింది. కానీ నాకంటే రాజమౌళి సీట్ చాలా కష్టం. నాకు నా రోల్ బాగానే అనిపించింది’ అంటూ చెప్పేశాడు. ప్రస్తుతం వీరి సంభాషణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.