మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రాబోతున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించబోతున్న ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్‌్ప్స సోమవారం 11 గంటలకు విడుదల చేశారు. ఈ గ్లిమ్‌్ప్స వీడియో సినీ అభిమానలు విపరీతంగా ఆకట్టుకుంది. ఇందిలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించినట్లు స్పష్టం తెలుస్తుంది.
కాగా ఈ వీడియోను కాస్తా సూక్ష్మంగా పరిశీలిస్తే కోమురం భీమ్‌గా ఎన్టీఆర్ ఒక పులిని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వీడియో మొదట్లో అడవిలో ఎన్టీఆర్ వెనుక ఒక పులి పరిగెడుతూ ఉంటుంది. సాధారణంగా ఆ పులి ఎన్టీఆర్‌ను తరుముతున్నట్లుగా ఉంది. కానీ వీడియో చివర్లో అదే పులి ఎన్టీఆర్ పోరాడుతున్న బ్రిటిషర్లపైకి దూకుతుంది. దీంతో సినిమాలో కోమురంభీమ్ పాత్ర ఆ పులిని మచ్చిక చేసుకుని సాకుతూ.. శత్రువులపై పోరులో తనకు సాయంగా ఉపయోగించుకున్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి నిజంగానే కోమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పులి పెంచుతాడో లేదో. మరి ఈ ఆర్‌ఆర్‌ఆర్ గ్లిమ్‌్ప్స మీకు ఎలా అనిపించుదో కామెంట్ల రూపంతో తెలియజేయండి.