టాలీవుడ్ లో మరో క్రేజీ టైటిల్ రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం ఏకంగా పవన్ కల్యాణ్ టైటిల్ వాడేయబోతున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
సాధారణంగా ఓ హీరో కోసం అనుకున్న టైటిల్.. మరో హీరో సినిమాకు పెట్టడం కొత్తేం కాదు. ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. స్టిల్ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. మిగతా హీరోల సంగతేమో గానీ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ వాడేయబోతున్నారనే న్యూస్ మాత్రం మస్తు క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటా క్రేజీ టైటిల్? ఈ సంగతి ఎంతవరకు నిజం?
అసలు విషయానికొచ్చేస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు ఏడాది టైమ్ తీసుకున్నాడు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత షూటింగ్ యమస్పీడుగా జరుపుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ గా తీస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా బ్యాలెన్స్ చేసేలా టైటిల్ పెట్టాలని చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఓ పేరుని ఫిక్స్ చేసింది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తీస్తున్న సినిమా కోసం ‘దేవర’ టైటిల్ పరిశీలించారు. ‘భీమ్లా నాయక్’ ఫ్లాష్ బ్యాక్ లో ఇది పవన్ క్యారెక్టర్ పేరు. దీన్ని పవన్-సముద్రఖని మూవీ కోసం పెడదామని చూశారు. కానీ ‘బ్రో’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ‘దేవర’ పేరుని ఎన్టీఆర్ మూవీ కోసం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు చిన్న గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం పవన్ టైటిల్ వాడబోతున్నారనే దానిపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Blood tankers 💥🔥🥵
Glimpse 💣#NTR30 #ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/cFR9zkKmft
— tarakfandom (@tarak_fandom) May 15, 2023