RRR చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్.. కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్టేడ్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి మోషన్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను చూసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. రిలీజ్ చేసింది మోషన్ పోస్టరే అయినా దానికి వెనకాల చెప్పించిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..’ అంటూ ఎన్టీఆర్ సూపర్ డైలాగ్‌తో దుమ్ములేపాడు.
He is here to change the way you know fear 🔥
Here’s the FURY OF #NTR30 (Telugu)
▶️ https://t.co/7rW5wkzPhB#HBDManOfMassesNTR@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sabucyril @sreekar_prasad @NTRArtsOfficial pic.twitter.com/P0FlYQhIKh— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2022
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది చూస్తే.. జూనియర్ సినిమాతో.. కొరటాల మళ్లీ తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకే కానీ.. మోషన్ పోస్టర్ కంటే ముందు మూవీ యూనిట్ ఓ ప్రీ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని కనిపించాడు. ఆ పోస్టర్‌ని చూస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌తో తెరకెక్కించబోయే మూవీని గుర్తుకు చేసింది. కొరటాల శివ, బన్నీతో సినిమా ఎనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ బ్యాక్ డ్రాప్.. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మోషన్ పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌కి దగ్గర పోలికలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Samuthirakani: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను Jr.NTR ముందే ఉహించాడు: సముద్రఖని
Similarities unnayi sodharaa.. 🌝#NTR30 #AA21 pic.twitter.com/d6PoeGxkHZ
— ABC! 📿🦅🧣 (@ABCHearthrob) May 19, 2022
ఇది గమనించిన అభిమానులు కొరటాల శివ.. బన్నీ కోసం రాసిన ఆ కథనే మార్చి తారక్‌తో తెరకెక్కిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య కాన్సెప్ట్ కూడా ఇదే అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. కొరటాల శివ స్పందించాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: NTR30: కొరటాల సినిమాలో ఎన్టీఆర్ సరసన సాయిపల్లవి..!