టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అఖండమైన విజయంతో దూసుకుపోతుంది. రిలీజైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో సినీ ప్రేక్షకుల అంచనాలను బీట్ చేసి మరీ ఆకట్టుకుంటుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ చిత్ర విజయాన్ని నందమూరి అభిమానులు మాస్ జాతర అనే నినాదంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య నటనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన నేపథ్య సంగీతానికి థియేటర్లలో వసూళ్ల వర్షం కురుస్తోందని టాక్.
ఇదిలా ఉండగా.. అఖండ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా అటు ఉత్తరాది రాష్ట్రాలలో సినీ ప్రేక్షకులు పాసిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అఖండ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో మాస్ జాతర జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాది మూవీ లవర్స్, సెలబ్రిటీలు కూడా అఖండ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పెద్దఎత్తున వెలువడుతున్నాయి. మరి ఇకనైనా అఖండ దర్శక నిర్మాతలు ఇతర భాషల్లోకి డబ్ చేసే విషయం పై ఆలోచన చేయాలనీ సినీవర్గాలలో టాక్ నడుస్తుంది.
ఇదివరకు బాలయ్య సినిమాల పై కామెంట్స్ చేసినవారే ఇప్పుడు వారి భాషల్లోకి అఖండ చిత్రాన్ని డబ్ చేయాలనీ కోరడం ఆశ్చర్యకరం. ఈ ఫీట్ కూడా బాలయ్యకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అఖండ చిత్రం త్వరలోనే బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో రిలీజ్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి అఖండ మాస్ జాతరకు భాషాబేధం లేకుండా బ్రహ్మరథం పడుతుండటం మరో విశేషం. మరి ఈ అఖండ చిత్రం డబ్బింగ్ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.