215 కోట్ల రూపాయల దోపిడీ కేసులో బిజినెస్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిని విచారిస్తూ ఉంది. వారినుంచి వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే సుఖేష్ ప్రియురాలిగా భావిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండజ్‌ను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. అంతేకాదు! ప్రముఖ ఐటెం గళ్ అయిన నోరా ఫతేహిని సైతం వారు విచారించారు. స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. తాజాగా, మరో సారి ఆమె ఢిల్లీ పటియాల హౌస్ కోర్టులో తన స్టేట్‌మెంట్ ఇచ్చారు.
సుఖేష్ తనతో ఎన్నో అబద్ధాలు చెప్పాడని ఆమె స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. తాను సుఖేష్ గళ్ ఫ్రెండ్‌గా ఉంటే విలాసవంతమైన ఇంటితో జీవితాన్ని కూడా ఇస్తానన్నాడని చెప్పారు. దీన్ని నేరుగా అడగకుండా అతడి సహచరుడైన పింకీ ఇరానీ ద్వారా అడిగించాడని తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె తన స్టేట్‌మెంట్‌లో ఇంకా ఏం చెప్పిందంటే.. ‘‘ మొదట్లో అతడెవరో నాకు తెలీదు. తర్వాత అతడో ఎస్‌ఎల్ కార్పొరేషన్ కంపెనీలో పని చేస్తున్నాడని అనుకున్నాను. నేను అతడితో నేరుగా మాట్లాడలేదు. అసలు అతడ్ని నేరుగా కలవను కూడా లేదు. దీని గురించి నాకు ఏమీ తెలీదు. కేవలం ఈడీ ఆఫీస్‌లో మొదటి సారి అతడ్ని నేరుగా చూశాను’’ అని పేర్కొంది.
కాగా, నోరా ఫతేహి 2014లో వచ్చిన రోయర్ అనే హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. 2015లో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఐటమ్ గాళ్‌గా మారారు. ఇక అప్పటినుంచి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. బాహుబలిలో ‘‘ఇరుక్కుపో.. హత్తుకుని వీరా.. వీరా..’’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీలో ఐటమ్ సాంగ్స్‌తో పాటు మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. మరి, సుఖేష్ తనకు ఇళ్లు, విలాసవంతమైన జీవితాన్ని ఆఫర్ చేశాడంటున్న నోరా ఫతేహి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.