సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండున్నరేళ్లు గడుస్తోంది. అయినా ఆయన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోవటం లేదు. ఆయన ఇంకా తమ మధ్య ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. సుశాంత్ 2020, జూన్ 14 బాద్రాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకున్న కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు కొన్ని నెలల పాటు దేశంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు సర్థుకున్నట్లే అని చెప్పొచ్చు.
ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ చివరగా నివాసం ఉన్న.. ఆత్మహత్యకు పాల్పడ్డ ప్లాట్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను ఓ ప్రముఖ ఇళ్ల బ్రోకర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఇళ్లు అద్దెకు ఉన్నట్లు అందులో పేర్కొన్నాడు. ఆసక్తి ఉన్న వాళ్లు తనకు ఫోన్ చేయాలంటూ ఫోన్ నెంబర్లు కూడా పెట్టాడు. దీన్ని బట్టి సుశాంత్ మరణం తర్వాత ఆ ప్లాట్‌లో ఎవ్వరూ దిగలేదని అర్థమవుతోంది. ఆ ప్లాట్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని రెండున్నర సంవత్సరాలు గడిచింది. అయిన్పటికి ఆ ప్లాట్‌లో ఎవ్వరూ అద్దెకు దిగటం లేదు.
ఇందుకు కారణంగా చాలా రకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇంట్లో సుశాంత్ ఆత్మ తిరుగుతోందని కొందరు అంటున్నారు. దీనిపై సదరు బ్రోకర్ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘‘జనం ఆ ప్లాట్‌లో దిగటానికి భయపడుతున్నారు. ప్లాట్ చూడటానికి మొదట ఆసక్తి చూపిన వారు.. తర్వాత అసలు విషయం తెలిసి రావటం లేదు. దానికి తోడు దాని ఓనర్ కూడా రెంట్ తగ్గించటం లేదు. రూ. 5 లక్షల రూపాయలకు తక్కువకు అద్దెకు ఇవ్వనని భీష్మించుకు కూర్చున్నాడు. రెంట్ తగ్గించి ఉంటే ఎప్పుడో సేల్ అయ్యేది. కానీ, ఆయన రెంట్ తగ్గించటం లేదు’’ అని పేర్కొన్నాడు. మరి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్లాట్‌లో ఇంతవరకు ఎవరూ దిగకపోవటానికి కారణం ఏమయిఉంటుందని మీరు భావిస్తున్నారు? దాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sea Facing Duplex 4BHK with a Terrace Mont Blanc
5 lakhs Rent
Carter Road, Bandra West. RAFIQUE MERCHANT 9892232060, 8928364794 pic.twitter.com/YTcjIRiSrw— Rafique Merchant (@RafiqueMerchant) December 9, 2022