సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసి వాళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటాం గానీ.. అంత సక్సెస్ ఉన్నవాళ్ళని కూడా మోసాలు చేసే మనుషులు ఉంటారనేది జనమెరిగిన సత్యం. దూరపు కొండలు నునుపు అన్న సామెత నుంచే మనుషులు అలా ప్రవర్తిస్తారో లేక మనుషులను బట్టే ఇలాంటి సామెతలు పుడతాయో తెలియదు కానీ.. మంచిగా, అమాయకంగా ఉంటే మాత్రం ముంచేసి పోతారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లనే ఇస్తానన్న రెమ్యునరేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే నిర్మాతలు ఉంటారన్న ఆరోపణలు పలువురు నటీనటులు చేసిన విషయం తెలిసిందే. అలా తనకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేదని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు.
ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రవితేజతో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్, రీసెంట్ గా వీర సింహా రెడ్డి ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. విన్నర్ సినిమా తప్పితే మిగతా సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమా అయితే మాసివ్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. డైరెక్షన్ పరంగా గోపీచంద్ మలినేని నెక్స్ట్ లెవల్ కి వెళ్లారన్న కామెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
క్రాక్ సినిమా సూపర్ హిట్ అయినా కానీ ఆ సినిమా నిర్మాత.. డబ్బులివ్వలేదని గొడవ అయ్యింది కదా అన్న ప్రశ్నకు.. గోపీచంద్ మలినేని సమాధానమిచ్చారు. అసలు తనకు ఏ సినిమాకి పూర్తి పారితోషికం ఎవరూ ఇవ్వలేదని సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఫస్ట్ టైం, నా లైఫ్ టైంలో పూర్తి పారితోషికం వచ్చిన సినిమా వీర సింహారెడ్డి అని వెల్లడించారు. వీర సింహారెడ్డి సినిమాకి మాత్రమే తాను పూర్తి పారితోషికం అందుకున్నానని వెల్లడించారు. మరి గోపీచంద్ మలినేని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.