ప్రపంచంలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డుల్లో ఒకటైన ఆస్కార్ అవార్డులకు 2022 సంవత్సరానికి గాను నామినేషన్ లను ప్రకటించారు. ప్రపంచంలోని సినీ అభిమానులు ఎప్పుడా అని ఎదురూచూసే ఆస్కార్ నామినేషన్లను వెల్లడించారు. ఈ ఏడాది చాలా పెద్ద సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. ఈ సంవత్సరం భారతీయ ప్రేక్షకులు ఆస్కార్ అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు
అడియాశలుగా మిగిలాయి. భారత్ పంపిన సూర్య నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కర్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్ కి చేరలేకపోయాయి.
ఇదీ చదవండి: యువకుడి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో సోనూసూద్
హాలీవుడ్ కు చెందిన ఓ వ్యక్తి “జైభీమ్” ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో ఉండొచ్చు అనే ట్వీట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. దీంతో మంగళవారం సాయంత్రం ఆస్కార్ శుభవార్త వినొచ్చు అని అభిమానులు అంతా ఎదురు చూశారు. కానీ అసలు నామినేషన్ లిస్ట్ లో “జైభీమ్” పేరు లేకుండా పోయింది. దీంతో “జై భీమ్” చిత్ర బృందంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో నిరాశ కనిపించింది. అది సోషల్ మీడియాలో ప్రస్ఫుటంగా కనిపించింది. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతోంది.
Jai Bhim out of Oscar race. But there’s still good news for India, Rintu Thomas’s “Writing with Fire” has got nominations for best documentary feature. #Oscars #JaiBhim #WritingWithFire pic.twitter.com/QwLcGCiIr0
— Tribal Army (@TribalArmy) February 8, 2022
అయితే ఓ విభాగంలో మాత్రం భారత్ నామినేషన్ దక్కించుకుంది. భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ “WRITING WITH FIRE”కి డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో రైటింగ్ విత్ ఫైర్ తోపాటు ‘ఎసెన్షన్, అట్టికా, ఫ్లీ, సమ్మర్ ఆఫ్ సోల్’ నామినేట్ అయ్యాయి. ఈ ఏడాది నామినేషన్స్ లో “ది పవర్ ఆఫ్ ది డాగ్” సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయ్యింది. విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ వంటి అగ్రనటులు ఉత్తమ నటుడి రేసులో ఉన్నారు. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు.
ఇదీ చదవండి:YSRCP మంత్రి సీదిరి అప్పలరాజుకు ఘోర పరాభవం..!
ఇక ఇప్పటివరకు మన దేశం నుండి ఆస్కార్ కోసం మూడు సినిమాలు మాత్రమే రేసులో నిలిచాయి. “మదర్ ఇండియా” (1957), “సలామ్ బాంబే” (1988), “లగాన్” (2001) మాత్రమే నామినేషన్స్ లో నిలిచాయి. మిగిలిన అన్నిసార్లూ నామినేషన్ గౌరవం కూడా పొందలేకపోయాయి. ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకుందాం అంటే నిరాశే ఎదురైంది. దీంతో వచ్చే ఏడాది గురించి మళ్లీ ఎదురు చూడాల్సిందే. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు నిరాశ ఎదురవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.