'RRR'మూవీ ఆస్కార్ మేనియా యమ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడా చూసినా సరే చర్చంతా ఈ సినిమా గురించే. ఇలాంటి టైంలో ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన తారక్.. చిన్న సైజ్ షాకిచ్చాడు.
ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఆస్కార్ ఈవెంట్ తెలుగు ప్రేక్షకులకు చాలా అంటే చాలా స్పెషల్. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ RRR మూవీ. ఫర్ ది ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి ఓ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ కు నామినేట్ కావడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే అమెరికా చేరుకున్న చిత్రబృందం ఆ హడావుడిలో పూర్తి బిజీగా మారిపోయింది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా ఎవరికి వారు ‘RRR’గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఇలాంటి టైంలో మెగా-నందమూరి ఫ్యాన్స్ కు చేదువార్త చెప్పాడు తారక్. ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ‘బాహుబలి’ లాంటి వండర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘RRR’ సంచలనాలు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని అలరిస్తూ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాని వరస అవార్డులు వరించాయి. వీటిలో ఆస్కార్ నామినేషన్స్ లో ‘నాటు నాటు’ సాంగ్ నిలవడం అనేది హైలెట్ గా నిలిచింది. దీంతో ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు గ్వరంగా కాలర్ ఎగరేశాడు. ఇక ఆస్కార్ వేడుకకు టైం దగ్గర పడుతున్నకొద్ది ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిన అభిమానుల్ని డిసప్పాయింట్ చేశాడు.
‘నాటు నాటు’ సాంగ్ నామినేషన్స్ లో ఉన్న నేపథ్యంలో సంగీత దర్శకుడు కీరవాణి, సింగర్స్ కాలభైరవ-రాహుల్ సిప్లిగంజ్ స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు చరణ్-తారక్ కలిసి ఈ పాటకు అదే స్టేజీపై డ్యాన్స్ కూడా చేస్తారని టాక్ వినిపించింది. దీంతో మెగా-నందమూరి ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే అలాంటిదేం లేదని ఎన్టీఆర్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. తను-చరణ్ డ్యాన్స్ ఏం చేయట్లేదని, తమకు రిహార్సల్స్ చేసేంత టైం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అదే టైంలో RRR, చరణ్-తారక్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. మరి ఎన్టీఆర్-చరణ్ నాటు నాటు డ్యాన్స్ ఉంటుందని మీలో ఎంతమంది అనుకున్నారు. కింద కామెంట్ చేయండి.