పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్‘. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి అధికారిక రీమేక్ చిత్రంగా భీమ్లా నాయక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ విడుదల పై ఇండస్ట్రీలో, అటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదివరకే భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొన్నటివరకూ ఏపీలో టికెట్ రేట్లు, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ కారణంగా భీమ్లా నాయక్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు వెనకడుగు వేశారు. ఇటీవలే టికెట్ ఇష్యూ పై చర్చలు కూడా జరిగాయి. అలాగే ఏపీలో 100% ఆక్యుపెన్సీకి అనుమతి లభించడంతో భీమ్లా నాయక్ నిర్మాతలు వెంటనే ఫిబ్రవరి 25న రిలీజ్ అని ఖరారు చేశారు.ఇదిలా ఉండగా.. ఇంకా భీమ్లా నాయక్ విడుదలకు రెండు రోజుల సమయం కూడా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. ఇంతలోనే భీమ్లా నాయక్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం చేదువార్త వినిపించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్న భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేసినట్లు సమాచారం.
తాజాగా భీమ్లా నాయక్ సినిమాకి ఏపీలో బెనిఫిట్ షోలు లేవని, ఒకవేళ బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని.. టికెట్ల ధరలు కూడా గవర్నమెంట్ రూల్స్ మేరకే అమ్మాలని.. ప్రతి థియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా వేయనున్నారని.. థియేటర్స్ యాజమాన్యం ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని కోరుతూ.. నోటీసు జారీ చేసినట్లు వార్తలు బయటికి వచ్చాయి.
AP : బెన్ ఫిట్ షో లేదు, వేస్తే కఠిన చర్యలు తప్పవు. టికెట్లు ప్రభుత్వ నిభందనలు మేరకు అమ్మాలి.ప్రతి ధియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుంది. ధియేటర్ యాజమాన్యం సహకరించాలి.
No Early Morning Shows or Hiked Prices for #BheemlaNayak
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) February 23, 2022
ఒకవైపు భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ కొన్ని ఏరియాలలో టికెట్ రేట్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన ఈ సినిమాని సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎస్. నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. మరి భీమ్లా నాయక్ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.