బుల్లితెరపై డాక్టర్ బాబుగా, శోభన్ బాబుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి నిరపపమ్ పరిటాల. కార్తీకదీపం సీరియల్ తో ఈ బుల్లితెర హీరో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ఎంతటి ప్రాముఖ్యతను పొందిందో డాక్టర్ బాబు పాత్ర కూడా అంతే ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నిరుపమ్ పరిటాల సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ జంట చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. వీరిద్దరూ ఎంతో చూడముచ్చటైన జంట అంటూ వీరి ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి: జీవితంలో డబ్బే ముఖ్యం.. సిగ్గు పడకుండా సంపాదించాలి
ఇక విషయానికొస్తే నిరుపమ్ భార్య మంజులది నేడు పుట్టిన రోజు. ఈ సందర్బంగా భర్త నిరపమ్ మంజులకు కవిత్వంతో వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్తూ వార్తల్లో నిలిచాడు. ఆగని అల.. కరగని కల.. అనుబంధాల వల.. తరగని నావలా.. ఇది దేవుడి లీల.. హ్యాపీ బర్త్ డే మంజుల.. చెప్పేశాను చాలా.. అంటూ నవ్వుతున్న ఎమోజీను కూడా పెట్టేశాడు. తాజాగా నిరుపమ్ ఈ విధంగా వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పడంతో కాస్త వైరల్ గా మారింది. ఇక బుల్లితెర నటి సుష్మా, అన్షు రెడ్డి, వాసు దేవ్ వంటి వారు మంజులకు స్పెషల్ విషెస్ అందించారు. నిరుపమ్ భార్యకు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.