బుల్లితెర వీక్షకులకు నిరుపమ్ పరిటాలను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు పేరుతో కంటే డాక్టర్ బాబుగా అందరకి సుపరిచితుడు. మాటీవీ లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ సక్సెస్, క్రేజ్ అటువంటిది. ఇక విషయానికొస్తే.. సినిమాల్లో లిప్ లాక్స్ సహజమే. మరి, టీవీల్లో? సీరియళ్ళు, షోల్లో ఉంటాయా?.. ‘క్యాష్’ షో లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అదే సందేహం కలుగుతోంది. కార్తీక దీపం ఫేం నిరుపమ్ పరిటాల లిప్ లాక్ ఇచ్చి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది.
తాజాగా నిరుపమ్ పరిటాల, ఆయన సతీమణి మంజుల.. సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రాంకు వచ్చారు. ఇంట్రడక్షన్ డ్యాన్సులు ఉంటాయి కదా! డ్యాన్స్ చేస్తూ చేస్తూ.. నిరుపమ్ పరిటాలకు వైఫ్ మంజుల కిస్ ఇచ్చినట్టు చూపించారు. అదీ లిప్ కిస్! డైరెక్టుగా పెదవులు కలిసినట్టు చూపించలేదు. కానీ, కలిసిన ఫీలింగ్ అక్కడున్న అందరకి కలిగించారు. ఆ సీన్ సమయంలో చుట్టుపక్కల జనాలు అరిచిన అరుపులు కూడా వినిపిస్తున్నాయి.ఇంత చూశాక సుమ ఊరుకుంటుందా.. ఏదో ఒకటి మాట్లాడాలిగా.. “మొన్ననే ఒక ముద్దుల టాస్క్ పెట్టారు. దాని కింద కామెంట్స్ చదివా. ‘ఇంకెందుకు రా? ఫస్ట్ నైట్ కూడా లైవ్ లో టెలికాస్ట్ చేసేయ్’ అని ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమేం చదవాల్సి వస్తుందో?” అని సుమ చెప్పుకొచ్చారు. మన బుల్లితెర యాంకర్ సుమ గారు.. ఇంకేం తీసుకొస్తారో ఇలాంటివి అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.