సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించి వార్తలు అంటే జనాలకు ఎంతో ఇంట్రస్ట్. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలంటే.. ఎంతో ఆసక్తి కనబరుస్తారు. దాంతో సోషల్ మీడియా, మీడియాలో వారికి సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒకటి వైరలవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తారు. దాంతో అలాంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ స్టార్ కపుల్‌కి సంబంధించి ఇలాంటి వార్తలే వైరలయ్యాయి. సదరు జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలు కాస్త సదరు హీరోయిన్ దృష్టికి చేరడంతో.. ఆమె ఈ వార్తలపై కాస్త ఘాటుగా స్పందించారు. ఇంకేందుకు ఆలస్యం.. డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటూ మండి పడ్డారు. ఆ వివరాలు..
నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి ఈ ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ జంటకు సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అందేంటంటే.. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ.. నిక్కీ గల్రానీ మండి పడ్డారు. తాను ప్రెగ్నెంట్ కాదని తెలిపారు.
— Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022
ఈ సందర్భంగా నిక్కీ గల్రానీ నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివీర డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ స్మైలీ ఎమోజీలను యాడ్ చేశారు. అంతేకాక.. ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్‌ని కాదు.. కాకపోతే భవిష్యత్తులో దీన్ని బ్రేక్ చేస్తా. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి అంటూ పోస్ట్ చేశారు. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో మలుపు, కృష్ణాష్టమి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆదిపినిశెట్టిని ప్రేమ వివాహం చేసుకుంది ఈ భామ.