టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో "నిఖిల్". ఎప్పుడూ ఒక ఫ్రెష్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నిఖిల్.. తాజాగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగి ఉన్నరహస్యాలను చెప్పడానికి హీరో నిఖిల్ "స్పై" అనే సినిమాతో వస్తున్నాడు.
మన దేశానికి స్వాతంత్య్రం రావడంలో ఎందరో మహానుభావుల కృషి ఉంది. వీరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధమ వరుసలో ఉంటాడు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి ఎవరు మర్చిపోగలరు. ఈ మహానుభావుడి చరిత్రను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయానే విషయం ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చరిత్ర విమాన ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్నప్పటికీ .. ఇప్పటివరకు ఎలాంటి సరైన ఆధారాలు లేవు. అయితే నేతాజీ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలను చెప్పడానికి హీరో నిఖిల్ “స్పై” అనే సినిమాతో వస్తున్నాడు.
టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో “నిఖిల్”. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూనే హిట్లు కొడుతూ తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో .. తన మార్కెట్ ని మరింతగా విస్తరించుకున్నాడు. నిఖిల్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అందులో ఆసక్తికలిగించేలా ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా ఉంటుందని గత సినిమాలను గమనిస్తే మనకు అర్ధం అవుతుంది. ప్రయోగాలు చేస్తూ హిట్ కొట్టడం బహుశా నిఖిల్ కి మాత్రమే చెందుతుందేమో. ఎప్పుడూ ఒక ఫ్రెష్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నిఖిల్ తాజాగా.. తన కొత్త సినిమా స్పై టీజర్ తో ప్రేక్షకులని పలకరించాడు. మరి ఈ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “స్పై”. ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐశ్వర్య మీనన్ ఏ సినిమాలో హీరోయిన్ గా నటించింది. చూస్తుంటే భారీ యాక్షన్ థ్రిల్లర్ తో ఈ సినిమా రానుందని తెలుస్తుంది. ఇందులో నిఖిల్ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను కనుగొనే ఒక స్పై పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. చూస్తుంటే ఈ కథ మొత్తం సుభాష్ చంద్ర బోస్ డెత్ వెనుక ఉండే మిస్టరీ గురించే అని అర్ధం అవుతుంది. అద్భుతమైన టెక్నాలజీతో, విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ తరహాలో ఉండే ఈ స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. నితిన్ నుంచి ఇంత భారీ యాక్షన్ చిత్రం ఇంతకుముందెన్నడూ చూడలేదు.జూన్ 29 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మొత్తానికి నిఖిల్ తెలియజెప్పాలనుకున్న ఈ మిస్టరీ ఎంతవరకు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.