కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హీరో నిఖిల్. 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. సూపర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక కార్తికేయ 2 విడుదలకు ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అందరికి తెలిసిందే. సినిమా ప్రమోషన్ సమయంలో నిఖిల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక గత ఎన్నికల్లో నిఖిల్.. వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీప్ రాజ్‌కి మద్దతుగా నిఖిల్ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో వైసీపీకి సపోర్ట్ చేశారు.. మరి ఇప్పుడు అదే పార్టీతో ఉన్నారా అని ప్రశ్నించారు విలేకరులు. అందుకు నిఖిల్.. ‘నేను సినిమాల్లో ఉన్నాను.. వైసీపీతో కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు నిఖిల్.
అంతేకాక ‘నేను గతంలో వైసీపీకి సపోర్ట్ చేశానంటే.. వాళ్లు మా రిలేటివ్స్ అందుకే ప్రచారంలో పాల్గొన్నాను. ప్రస్తుతం నేను సినిమాల్లో ఉన్నాను.. వైసీపీతో కాదు.. నేను ఒకే పార్టీతో లేను.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను. గతంలో జేడీ లక్ష్మినారాయణ జనసేనలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను. హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకి మద్దతు ఇచ్చాను. టీడీపీకి కూడా సపోర్ట్ చేశాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.. రాజకీయాల గరించి పట్టించుకోను. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారికి సపోర్ట్ చేస్తాను. నేను యాక్టర్‌ని.. నాకు తెలిసింది సినిమాలే’ అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.