యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది నిహారిక NM. ఇప్పుడు ఏకంగా సినిమా స్టార్స్ తోనే షార్ట్ వీడియోలు చేసేస్తోంది. నిహారిక NM అంటే.. సోషల్ మీడియాలో స్టార్ మాత్రమే కాదు.. మాంచి ఎంటర్టైనర్ అనికూడా అనిపించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నిహారిక ఎక్కువగా తన వీడియోలలో ఫన్ క్రియేట్ చేసేందుకే ఇష్టపడుతుంది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ షార్ట్ వీడియో చేసి ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
తాజాగా మహేశ్ బాబు హీరో నటించిన సర్కారు వారి పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిహారిక.. మహేష్ బాబుతో ఓ ఫన్ వీడియో చేసింది. సాధారణంగా కొత్త సినిమాలు ఏవి రిలీజైనా ఆ స్టార్ హీరోలతో షార్ట్ వీడియోలు చేస్తూనే ఉంటుంది నిహారిక. ఆ విధంగా సర్కారు వారి పాట స్టార్ మహేష్ తో చేసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె సర్కారు వారి పాటలో చూపించిన తాళాల గుత్తిని కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంది. ‘మనీహీస్ట్’ ప్రొఫెసర్ తరహాలో ఆ తాళాల గుత్తిని కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంది. కానీ చివరి నిమిషంలో నిహారికను మహేష్ సర్ప్రైజ్ చేశాడు.
ఈ క్రమంలో నిహారిక – మహేష్ బాబుల మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటినుండి నిహారిక వీడియోలన్నీ ఫన్నీగానే ఉంటాయి. ఆమె ఫన్నీ ఎక్సప్రెషన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అందుకే సెలబ్రిటీలు సైతం నిహారికతో షార్ట్ వీడియోస్ చేసేందుకు నో చెప్పలేకపోతున్నారు. ఇటీవలే కేజీఎఫ్-2 రిలీజ్ టైంలో రాకింగ్ స్టార్ యష్ తో కూడా నిహారిక ఫన్నీ వీడియో చేసింది. ఆ వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అయ్యింది.
అసలు ఈ నిహారిక NM ఎవరు.. ఎక్కడినుండి వచ్చింది? అని ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. నిహారికకు హిందీ, ఇంగ్లీష్ లతో పాటు తెలుగు, తమిళ భాషలు కూడా బాగా తెలుసు. చెన్నైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ.. కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక ఇన్ స్టాగ్రామ్ ఫన్నీ వీడియోలు చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది. నిహారిక హోమ్ టౌన్ బెంగుళూరు కావడంతో.. ఇక్కడి కల్చర్, పేరెంట్స్, ఫ్యామిలీ అంశాలపై ఫన్నీ వీడియోలు చేస్తోంది. నిహారిక మాట్లాడే ఇంగ్లీష్ కూడా సౌత్ ఇండియన్స్ మాట్లాడే యాసకు దగ్గరగా ఉంటుంది. ఆ యాసే ఇప్పుడు నిహారిక వీడియోలకు ప్లస్ అయ్యింది.
సౌత్ హీరోలే కాదు.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ సైతం నిహారికతో వీడియోలు చేశారు. నిహారిక వీడియోలను ఇష్టపడే రకుల్ ప్రీత్ సింగ్, రెజినా లాంటి హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా వీడియోలు చూసి ఫాలోవర్స్ పెట్టే కామెంట్లు చూస్తే కన్నీళ్లు వస్తుంటాయి. నేను చేసే వీడియోలు దాదాపు నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నుండి పుట్టేవే” అంటోంది. ఇక నిహారిక చిన్నప్పటి నుంచి తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగిందట. లేటెస్ట్ గా మహేష్ బాబుతో చేసిన వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ భామకు మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. మరి నిహారిక వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.