జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పంటల నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం జనసేన పార్టీకి చాలా మంది విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలి కూడా కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే సద్దుదేశంతో రూ.35 లక్షలు విరాళం జనసేనకు అందించింది. తాజాగా ఈ కార్యక్రమంపై మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పందించారు. “ఈ మంచి పనిలో తమను కూడా భాగస్వాములు గా చేసిన పవన్ కళ్యాణ్ బాబాయ్ కి ధన్యవాదాలు” అంటూ నిహారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇది తెగ వైరల్ అవుతోంది.
జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి స్వయంగా తెలుసుకుని మెగా ఫ్యామీలి ఆర్థిక సాయం చేసింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తుకు ఎంతో కొంత అండగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఆ మొత్తాన్ని కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి అందించారు. అందులో మెగా హీరోలు వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు అందించారు. వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు ఇచ్చారు. మరొకరు మరో రూ.5లక్షలు ఇచ్చారు. అయితే తాజాగా కౌలు రైతుల భరోసా యాత్రపై నిహారిక కొణిదెల ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
“ప్రజలకు సేవచేయడం, ఆశ , విశ్వాసంతో కూడిన భవిష్యత్తును నిర్మించేందుకు మీరు చేస్తున్న ఈ మంచి పనిలో చిన్న భాగం కావడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ బాబాయికి ధన్యవాదాలు. నేను ఎప్పుడూ ఎదురుచూసే నాయకుడు మీరే. మంచి భవిష్యత్ తీసుకురాగలిగేది మీరు మాత్రమే!” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం నిహారిక చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనసేన చేపట్టిన ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులైనందుకు ధన్యవాదాలు అక్క అంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. నిహారిక ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you Kalyan babai for giving us an opportunity to be a small part of your Herculean effort of helping people and building a future of hope and faith to our people.
You are a leader that I will always look up to.
It’s only YOU who can bring about a better tomorrow! 🙏🏼💪🏼 https://t.co/CE8KKj9zEc— Niharika Konidela (@IamNiharikaK) June 16, 2022