Niharika Konidela: మెగా కాంపౌండ్‌నుంచి సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ మెగా గాళ్.. నిహారిక. ఆమె నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఓ వైపు నటిగా మరో వైపు యాంకర్‌గా, ప్రొడ్యూషర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. భర్త జొన్నల గడ్డ చైతన్యతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నిహారిక వైవాహిత జీవితంతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం పక్కకు పెట్టలేదు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు.
భర్తతో విభేదాలు, విడాకులు అంటూ వచ్చిన పుకార్లకు కూడా ఒక్క ఫొటోతో గట్టి సమాధానం చెప్పారు. తాను,చైతన్య ఎప్పటికీ ఒక్కటే అన్నట్లుగా ఇద్దరూ లిప్‌లాక్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు! ఎప్పటి కప్పుడు గ్లామరస్ ఫొటోలతో దర్శనమిస్తుంటారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన న్యూలుక్ ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలలో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్నారామె. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Surekha: అలాంటి అబ్బాయిలే ఇష్టమంటూ రెచ్చిపోయిన సురేఖా వాణి! వీడియో వైరల్..