Rubina Qureshi: సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ‘నైటింగేల్ ఆఫ్ సింధ్’గా పేరొందిన ప్రముఖ గాయని రుబీనా ఖురేషీ బుధవారం ఉదయం కరాచీలో మరణించారు. ఆమె వయసు 81. గత రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె తన నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. రుబీనాకు భర్త, ప్రముఖ నటుడు ముస్తఫా ఖురేషీ, కుమారుడు(నటుడు అమీర్ ఖురేషీ) మరియు కుమార్తె ఉన్నారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిన కారణంగా రుబీనా.. తన భర్త, నటుడు ముస్తఫా ఖురేషి అందుకున్న ప్రెసిడెన్షియల్ ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డును స్వీకరించిన రోజు(మార్చి 23)న గవర్నర్ హౌస్‌కు కూడా వెళ్లలేకపోయింది. ఇక రుబీనా 1940 అక్టోబర్ 19న హైదరాబాద్ లో జన్మించారు. ఆమె 1960 లలో రేడియోలో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సింధీ సంగీతంలో రాణించింది.
రుబీనా 1970 సెప్టెంబర్ లో నటుడు ముస్తఫా ఖురేషీని వివాహం చేసుకుంది. ఆమెను “నైటింగేల్ ఆఫ్ సింధ్” అని పిలుస్తారు. కెరీర్ లో శాస్త్రీయ గాయనిగా ఉర్దూ, సింధీ, సరైకి, బలూచి, పాష్టో, పంజాబీ మరియు బెంగాలీ భాషల్లో పాడారు. రుబీనా ఇండోనేషియా, చైనా, టర్కీ, ఇండియా, UK మరియు USAలలో ప్రదర్శనలలో పాల్గొని మంచి గుర్తింపు పొందారు. సూఫీ సంగీతంలో రుబీనా చేసిన సేవలకు గానూ, ఆమెకు “ఖలందర్ షాబాజ్”, “ఖువాజా గులాం ఫరీద్” అవార్డులు అందుకుంది.
ఆమె 2012లో రేడియో హైదరాబాద్ నుండి అవార్డు.. ఆగస్ట్ 14, 2021న పాకిస్థాన్ ప్రభుత్వం ఆమె కోసం ‘తమ్‌ఘా-ఇ-ఇమ్తియాజ్’ను ప్రకటించింది. ఇదిలా ఉండగా.. అస్ర్ ప్రార్థన తర్వాత అబ్దుల్లా షా ఘాజీ మందిరంలో రుబీనా అంత్యక్రియలు జరిగాయి. విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ముస్తఫాతో పాటు పలువురు ప్రముఖులు రుబీనాకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Rest in peace
Bulbl-e-Mehran, a gentlewoman, a magnificent voice, Madam Rubina Qureshi is no more. pic.twitter.com/d2UN5kWPXb— zєєѕнαи (@Ahmed_Zeexxhan) July 13, 2022
Rubina Qureshi is no more. May Allah Almighty bless the departed soul. pic.twitter.com/OhPuG6vw9Z
— Yousaf Alamgirian (@YusafAlamgirian) July 13, 2022