టాలీవుడ్ లో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి, టాలెంట్ చూపించాలి, గ్లామర్ షోతో ఆకట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో కారణం చెబుతారు. కానీ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఇవేవి అవసరం లేదని అంటోంది. అది ఒక్కటి ఉంటే చాలని, ఇండస్ట్రీలో స్టార్ హోదా తెచ్చుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ గురించి ఆమె ఫ్యాన్స్ కూడా తెగ మాట్లాడుకుంటున్నారు.
ఇక విషయానికొస్తే.. హైదరాబాద్ లో పుట్టిన నిధి అగర్వాల్, బెంగళూరులో పెరిగింది. బాలీవుడ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య ‘సవ్యసాచి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక టాలీవుడ్ లోకి ఈమె వచ్చి దాదాపు ఐదేళ్లయిపోయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. హీరోయిన్ల సక్సెస్ ఫార్ములా గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. ముఖ్యంగా హీరోయిన్లకు లక్ కలిసొస్తే చాలని హిట్స్ కొట్టేస్తారని అభిప్రాయపడింది.
‘కొన్ని స్టోరీస్ పేపర్ పై అద్భుతంగా ఉంటాయి. స్క్రీన్ పై తేలిపోతాయి. పేపర్ పై చాలా నార్మల్ గా ఉన్న స్టోరీస్ కొన్ని సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి 90 శాతం సక్సెస్ కి లక్కే కారణం. స్టోరీస్ ఆధారంగా సినిమాలు ఎంచుకునే రేంజ్ కు నేనింకా రాలేదు. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలనుంది. ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్టింగ్ పరంగా ఎలాంటి తేడాలు లేవు. బిజినెస్ లో మాత్రం మార్పులుంటాయి.’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. మరి నిధి చెప్పినట్లు.. హీరోయిన్లకు లక్ ఉంటే చాలా ఇంకేమైనా ఉండాలా? మీరే అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.