తెలుగు బుల్లితెర ప్రేక్షకులను 9 ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్’లో కొంతకాలంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే జబర్దస్త్ ద్వారా లైఫ్ పొందిన యాంకర్స్ కూడా ఉన్నారు. వారెవరో కాదు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి వీరిద్దరూ యాంకర్స్ గా స్టేజిపై గ్లామర్ ఒలికిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఈ క్రమంలో దాదాపు 9 ఏళ్ళ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ప్రస్థానం ముగిసింది. ఆమె స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా కొత్త అమ్మాయి కూడా వచ్చేసింది. ఏకంగా పల్లకిలో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యాంకర్ ఎవరా అని అనుకుంటున్న తరుణంలో ఆమె ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు నిర్వాహకులు. తాజాగా విడుదలైన ప్రోమో చూశాక అందరిలోనూ అనసూయను మించిన అందాలరాశి ఎవరనే ఉత్కంఠ నెలకొంది.
గత వారం ఎపిసోడ్ తో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఈ షో ప్రారంభం నుండి యాంకర్ గా ఉన్న అనసూయ అనూహ్యంగా బయటికి వెళ్లిపోవడం అందరికి షాకింగ్ గానే అనిపించింది. అనసూయను షో వీడకుండా చేయాలని టీం లీడర్స్, జడ్జెస్ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. జడ్జి ఇంద్రజ మిమ్మల్ని ఈ స్టేజ్ చాలా మిస్ అవుతున్నట్లు చెప్పింది. ఇక అనసూయ స్థానంలో వచ్చే ఆ యాంకర్ ఎవరనేది అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో కొత్త యాంకర్ ఎవరో రివీల్ చేయనున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి కార్తికేయ 2 మూవీ టీమ్ నిఖిల్, శ్రీనివాసరెడ్డి, దర్శకుడు చందూ మొండేటి హాజరయ్యారు. ప్రోమో చూస్తుంటే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో యాంకర్ ని పరిచయం చేశారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. జబర్దస్త్ కొత్త యాంకర్ గా వచ్చింది యాంకర్ మంజూష అని కొందరు అంటున్నారు, లేదు యాంకర్ రష్మీనే అయ్యుంటుందని మరికొన్ని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు అయ్యుంటారనే మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.