ఈ మధ్య కాలంలో వచ్చిన రియలస్టిక్ సినిమాల్లో ‘లవ్‌టుడే’ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ జనాలను ఎంత పాడు చేసింది. మొబైల్ ఫోన్ ప్రతీ మనిషి జీవితంలోని సీక్రెట్లను ఎలా దాస్తోంది అన్న విషయాలను కళ్లకు కట్టాడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఇక, ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ నిజ జీవితాలకు దగ్గర ఉండటం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అయితే, నటుడు సినిమాలో చేసిన పాత్రకు.. వారి నిజ జీవితానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు కొందరు నెటిజన్లు.
సినిమాల్లో విలన్ పాత్ర చేస్తే.. వాళ్లు నిజ జీవితంలోనూ అలానే ఉంటారని భావిస్తున్నారు. తాజాగా, లవ్‌టుడే సినిమాలో ‘రేవ్’ పాత్ర చేసిన ఆజీద్‌కు నెటిజన్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమాలో ఆజీద్ కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. చివర్లో హీరోయిన్‌ను నిస్సహాయ స్థితిలో వదిలేసే బెస్టీ పాత్రలో నటించారు. ఇదే నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. నిఖిత కష్టంలో ఉంటే ఎందుకు పారిపోయావంటూ సోషల్ మీడియా వేదికగా రేవ్‌ను ప్రశ్నిస్తున్నారు.
నిఖితను ఆజీదే మోసం చేశాడంటూ మండిపడుతున్నారు. దీంతో ఆజీద్ నెటిజన్లను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ నేను మీరు అనుకుంటున్న లాంటి వాడ్ని కాదు. అది సినిమాలో పాత్ర మాత్రమే. నేను బయట అలా ఉండను. సినిమా వేరే.. నిజ జీవితం వేరే. మీరు దాన్ని గుర్తించాలి. సినిమాలో ఉన్నట్లుగానే మేము బయట కూడా ఉంటామని అనుకోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు. మరి, నెటిజన్లు ‘లవ్‌టుడే’ నటుడు ఆజీద్‌పై ట్రోలింగ్స్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.