సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి ప్రశంసలు, విమర్శలు రావడం అనేది మామూలే. ఇది ప్రతి సినిమా విషయంలో జరుగుతుంటుంది. కానీ.. ఓ సినిమా రిలీజ్ టైంలో దర్శకనిర్మాతలు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నెటిజన్స్ కంట్లో పడతారు. ఎందుకంటే.. రిలీజ్ ముందు సినిమాపై ఫుల్లుగా హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఆ హైప్ ప్రకారం పర్ఫెక్ట్ కొత్త కథకథనాలతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఓకే. అదే హైప్ క్రియేట్ చేసిన సినిమా బోల్తాపడితే మాత్రం.. రాబోయే ట్రోల్స్ ని ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాల్సిందే.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ విడుదలై థియేటర్లలో ఆడుతోంది. ప్రీమియర్స్ షోల నుండే సినిమాకు సరైన టాక్ రాలేదు. అయినాసరే రివ్యూస్ వచ్చేవరకు వెయిట్ చేద్దాం అనుకుంటే.. సినిమాకు ప్లాప్ అంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాపై క్రియేట్ హైప్ దృష్ట్యా డైరెక్టర్, హీరోలతో పాటు సహనిర్మాత ఛార్మి ట్రోలింగ్ కి గురవుతోంది. గతంలో ఓ సినిమా రిలీజ్ టైంలో ఛార్మి చేసిన ఓ ట్వీట్ ని బేస్ చేసుకొని ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.
ఆ వివరాల్లోకి వెళ్తే.. 2015లో అక్టోబర్ 16న ఛార్మి.. స్మైలింగ్, క్లాపింగ్ ఎమోజిలతో ఓ ట్వీట్ పెట్టింది. అయితే.. అదే రోజు రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ మూవీ విడుదలైంది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మరి ఛార్మి ఆ సినిమా రిజల్ట్ ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టిందా? లేక వేరే ఏమైనా కారణం ఉందా? అనేది తెలియదు. కానీ.. ఇప్పుడు లైగర్ కి నెగటివ్ రావడంతో ఛార్మి పోస్టును రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు నవ్వావ్ కదా.. ఇప్పుడు మీ సినిమా రిజల్ట్ చూసి నవ్వవేంటీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఛార్మి నిజంగా అప్పట్లో ఎందుకు ఆ ట్వీట్ పెట్టిందో తెలియలేదు. కానీ.. ఇప్పుడైతే ట్రోల్స్ లో ఫుల్లుగా ఆడుకుంటున్నారు. అసలు ఛార్మిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అంటే.. లైగర్ సినిమా ప్రొడ్యూసర్ లలో ఛార్మి కూడా ఒకరు. కాబట్టి, లైగర్ రిలీజ్ అయినప్పటి నుండి నెటిజన్స్ మీమ్స్ తో ఏకిపారేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక లైగర్ సినిమా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ చుపించారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి లైగర్ విషయంలో ఛార్మిని ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ika nundi prathi puri cinema ki lepochu ee tweet #Liger https://t.co/nST28jNwJB
— Mashkoor Shaik (@Mashkoor27) August 25, 2022
Hello @Charmmeofficial garu!
Now It’s our turn
😂🤣😂🤣😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏👏👏👏#Liger 🙊😂 pic.twitter.com/6XVayFOAN9— Vakeel Kalyan🦅 (@vakeel_kalyan) August 25, 2022
Disaster #Liger anta kadha 🥲 https://t.co/YAxagQgQwq pic.twitter.com/KaFnvoh7Q6
— 🇷am🇷ohit🇷eddy❤️🔥 (@RamRohithReddy) August 25, 2022