ఇళ్లల్లో పని చేసే వారిని.. సొంత మనుషుల మాదిరి ఆప్యాయంగా చూసే వారు చాలా తక్కువ. జీతం తీసుకుని పని చేసే వారి మీద ఎందుకు అభిమానం చూపాలి.. అలా చేస్తే పనోళ్లు నెత్తికెక్కుతారు అనుకునే వారే ఎక్కువ. కానీ ఏళ్ల తరబడి.. ఒకే కుటుంబాన్ని అంటిపెట్టుకుని.. నమ్మకంగా పని చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికి యజమాని నుంచి ఆదరాభిమానులు లభించవు. కానీ కొందరు యజమానులు మాత్రం.. తమ దగ్గర పనిచేసేవారి బాగోగులు పట్టించుకుంటారు. వారికి ఆపద వస్తే.. అండగా నిలబడి మేమున్నాం అంటూ అభయం ఇస్తారు. ఇదే పని చేశారు ప్రముఖ నటుడు రావు రమేష్. పదేళ్ల పాటు తన దగ్గర నమ్మకంగా పని మేకప్ మాన్ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోయి అనాథలా మారిన కుటుంబానికి రావు రమేష్ మద్దతుగా నిలిచాడు. వారికి 10 లక్షల ఆర్థిక సాయం చేయండమే కాక.. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా తనకు చేయతనైన సాయం చేస్తానని మాట ఇచ్చాడు.
రావు రమేష్ చేసిన పనిపై నెటిజనులతో పాటు సిని ఇండస్ట్రీ వారు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘సొంతవాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో.. మీరు చూపిన మానవత్వం చాలా గొప్పది. జీతం ఇచ్చినందుకు సదరు మేకప్‌మాన్ మీ దగ్గర పని చేశాడు. మీరు ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు మానవత్వం ప్రదర్శించి.. కుటుంబ పెద్దను కోల్పోయి.. దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి అండగా నిలిచారు. రీల్ మీద మాత్రమే గొప్ప గొప్ప డైలాగ్‌లు చెప్పి.. వాస్తవంగా అందుకు భిన్నంగా ప్రవర్తించే వారు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ మీరు మాత్రం అందుకు భిన్నమని.. మీతో పని చేసే వారిని కూడా ఎంతో ఆదరంగా చూస్తారని ఈ ఒక్క సంఘటనతో రుజువయ్యింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.