‘‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ భవన ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హాజరయ్యారు. ఓ సందర్భంగా ఓ ఆయన ఓ మోడల్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీలు దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం ‘‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు చాలా మంది వచ్చారు. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోలు సందడి చేశారు.
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్-కియారా అద్వాణీ, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, రజనీకాంత్, బోనీ కపూర్ తదితరులతో పాటు అమెరికా మోడల్ జిగి హదిద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిగి హదిద్ బాలీవుడ్ తారలు ఫారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, బోనీ కపూర్‌లతో పొటో దిగారు. ప్రస్తుతం జిగి, బోనీతో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు బోనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఆ ఫొటోలో బోనీ, జిగి నడుముపై రెండు వేళ్లు నొక్కి పట్టి ఉన్నారు.
దీంతో నెటిజన్లు.. ‘‘ కూతురు వయసున్న అమ్మాయితో ఎంటా పాడు పని’’.. ‘‘ యువ నటులు, ఇతరులను చూసి బోనీ కపూర్ నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది’’.. ‘‘ఎందుకు కొంతమంది తమ చేతుల్ని దూరంగా పెట్టుకోలేరు’’..‘‘ మీ కూతుర్ల నడుమును వేరే వాళ్లు ఇలానే పట్టుకుంటే మీరు ఎలా ఫీలవుతారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, మోడల్ నడుముపై చెయ్యి వేసి విమర్శల పాలవుతున్న బోనీ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.