అరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అనేక టీవీ ఛానల్స్ పలు షోలకు వ్యాఖ్యతగా వ్యహవహరించి ఫేమస్ అయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఈ బ్యూటీ పాల్గొన్ని ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాందించింది. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. రీల్స్ కూడా చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఆమె చేసిన ఓ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ఆ వీడియోకి నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి ఆరియానపై నెటిజన్లు అంతలా ఆగ్రహం వ్యక్తం చేయాడని గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ నటుడు , కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా మూగబోయింది. ఈయన మరణంపై పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆయన కుటుంబం, ఆయన అభిమానులు అయితే శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక సోమవారం మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలా కృష్ణం రాజు మృతిపై టాలీవుడ్ తో పాటు మిగిలిన అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన అందరు మౌనంగాఉండిపోయారు.
అయితే ఇలాంటి బాధకర సమయంలో అరియానా.. తాను ఫుల్ జోష్ లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కారులో డ్రైవింగ్ చేస్తూ ప్రభాస్ సినిమాలోని పాట పాడుతూ బాగా చిల్ అవుతూ ఉంది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. కృష్ణం రాజు మృతితో సినీ పరిశ్రమ విషాదంలో ఉంటే నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ కొందరు, నీకు అసలు తెలివి ఉంటే ఇలా చేయావు అని మరికొందరు నెటిజ్లను అరియానను ఏకి పారేస్తున్నారు. ప్రభాస్ పెద్దనాన్న మరణిస్తే నువ్వేమో ఆయన పాటతోనే రీల్స్ చేస్తున్నావా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఏకిపారేస్తోన్నారు. ప్రస్తుతం అరియానా వీడియో, నెటిజన్ల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.