'ఇలా గ్లామర్ ఫోటోలలో మిమ్మల్ని చూసి ఇంట్లో నా భర్త కూడా మీలాగే రెడీ అవ్వమంటున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజి షేర్ చేసింది ఓ ఆంటీ.
తెలుగు ప్రేక్షకులకు నటి సురేఖావాణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సురేఖావాణి.. ఈ మధ్య సినిమాల పరంగా స్పీడ్ తగ్గించేసి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రెజెంట్ సురేఖా వయసు 45 ఏళ్ళు. ఆమెను చూస్తే అలా ఉండదు కానీ ఇది నిజం. ఆల్రెడీ సురేఖకు పెళ్లీడుకొచ్చిన కూతురు సుప్రీత కూడా ఉంది. సరే కాలం మారుతోంది కదా! ట్రెండ్ కి తగ్గట్టుగా కూతురు ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. కూతురు కంటే మోడరన్ గా సురేఖ ఉండటం విశేషం. పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా 6 లక్షలకు పైనే సంపాదించుకుంది.
ఈ క్రమంలో సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండే సురేఖావాణి.. కూతురితో కలిసి ఏ స్థాయిలో రచ్చ చేస్తుందో తెలిసిందే. సురేఖావాణి ఆంటీ అయినప్పటికీ.. ఇప్పుడు కూడా ఆమె ఓ గ్లామరస్ ఫోటో పెడితే ఆత్రంగా చూసే ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. వారిని ఇంప్రెస్ చేసేందుకు సురేఖ కూడా అప్పుడప్పుడు చాలా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సురేఖావాణి.. గులాబీ కలర్ చీరలో ఓ అందమైన పిక్ పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఆ చీరలో సురేఖ అందాలను ఆస్వాదిస్తూ.. కామెంట్స్ లో చర్చించుకుంటున్నారు నెటిజన్స్.
ఇక ఫ్యాన్స్, ఫాలోయర్స్ అంటే అందాలను పొగుడుతూ కామెంట్స్ చేస్తారనుకోండి. విచిత్రంగా ఓ లేడీ సురేఖావాణి అందంపై కామెంట్ చేసింది. ‘ఇలా గ్లామర్ ఫోటోలలో మిమ్మల్ని చూసి ఇంట్లో నా భర్త కూడా మీలాగే రెడీ అవ్వమంటున్నాడు’ అని కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజి షేర్ చేసింది. దీంతో ఇప్పుడు సురేఖావాణి ఫోటోపై కాకుండా ఆ లేడీ పెట్టిన కామెంట్ పై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సురేఖావాణి పిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సురేఖావాణి ప్రెజెంట్ తన కూతురితో పాటే సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఆ మధ్య రెండో పెళ్లంటూ వార్తల్లో కూడా నిలిచింది. మరి సురేఖావాణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.