కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న నయన్ దంపతులు.. తాజాగా కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత నయన్ – విగ్నేష్ లు చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇంతకీ ఈ కొత్త దంపతులు ఏం చేసారంటే.. స్టార్ సెలబ్రిటీలు అయినటువంటి నయన్ – విగ్నేష్.. పెళ్లి తర్వాత సింప్లిసిటీతో మనసులు గెలుచుకుంటున్నారు. అయితే.. తాజాగా నయన్ దంపతులు దర్శించుకున్న దేవి ఆలయం చాలా పురాతనమైందిని.. అక్కడ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటుందని చెబుతున్నారు. దేవి దర్శనం అనంతరం నయన్, విగ్నేష్ కేరళలోని లోకల్ వంటకాలను రుచి చూశారట. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయన్.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడాక తన లైఫ్ స్టైల్ ని మరింత సింపుల్ గా మార్చుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా స్టార్డమ్ ఉన్న సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే.. ఫ్యాన్స్ ని దగ్గరకి రానిచ్చే విషయంలో.. జనాల్లో కలిసిపోవడంలో జాగ్రత్త వహిస్తూ తెలివిని ప్రదర్శిస్తుంటారు. కానీ.. ఈ జంట అలా కాకుండా కొచ్చిలోని ఓ లోకల్ రెస్టారెంట్ లో సందడి చేశారు. అలాగే ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. వీరి సింప్లిసిటీ చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నయన్ – విగ్నేష్ సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Happy ..#NayantharaVigneshShivan #Nayanthara #nayanwikki pic.twitter.com/0bykxSMa4Y
— Cinema Theater (@CTnews24) June 14, 2022