Rajamouli: దేశంలో ప్యాన్ ఇండియా సినిమాల బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా రాజమౌళినె. భారత దేశ చలనచిత్ర రంగానికి ప్యాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. బాహుబలి సినిమాతో సౌత్ సినిమా ఖ్యాతిని పెంచటంతో పాటు.. ఇండియన్ సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి రెండు సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక, ప్యాన్ ఇండియా సినిమాల పరంగా రాజమౌళిని ఢీకొట్టే డైరెక్టరే లేరు అనుకుంటున్న సమయంలో కేజీఎఫ్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను ప్రమోట్ చేసింది కూడా రాజమౌళినె. అసలు కన్నడలో తప్ప ఏ బాషలోనూ మార్కెట్ లేని యశ్, కన్నడ సినిమాను హిందీలో రిలీజ్ చేయటానికి కృషి చేశారు.
కేజీఎఫ్ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రమోషన్ల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ సినిమా అన్న పదం పోయి.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలు ఇండియన్ సినిమాలు అవ్వాలన్నదే తన ధ్యేయంగా పేర్కొన్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు మౌత్ పబ్లిసిటీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాజమౌళి ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా రిలీజైన కొన్ని రోజులకే కేజీఎఫ్ 2 విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సారి ప్రమోషన్లలో రాజమౌళి కనిపించలేదు. ఆ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. సినిమా విడుదలై అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమాను మించి వసూళ్లను రాబట్టింది.అప్పుడు కూడా రాజమౌళి స్పందించలేదు. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కానీ, తాజా, ప్యాన్ ఇండియా చిత్రం ‘‘బ్రహ్మాస్త్ర’’ ప్రమోషన్లో రాజమౌళి చురుగ్గా పాల్గొంటున్నారు. నిన్న వైజాగ్‌లో హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే, ఇక్కడ నెటిజన్లను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 గురించి ఏ మాత్రం స్పందించని రాజమౌళి ‘బ్రహ్మాస్త్ర’ కోసం ఎందుకంత ఆరాటపడుతున్నాడు? సౌత్ సినిమా, నార్త్ సినిమా అన్నతేడా ఉండకూడదని చెప్పిన ఆయన సౌత్ సినిమా ప్రమోషన్లకు రాకుండా నార్త్ సినిమా ప్రమోషన్లోలో ఎందుకు పాల్గొంటున్నారు?.. రాజమౌళి ‘బ్రహ్మాస్త్ర’ను సౌత్‌లోని నాలుగు భాషల్లో ప్రజెంట్ చేస్తున్న కారణంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారని అనుకుందాం.
కానీ, సౌత్ సినిమా అయిన కేజీఎఫ్ 2 గురించి కూడా ఓ చిన్న ట్వీట్ చేసుంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి పరిచయం చేసిన సినిమా ఆయన సినిమా కంటే ఎక్కువ విజయం సాధించటంతో రాజమౌళి అహం దెబ్బతినిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి రాజమౌళి, కేజీఎఫ్ 2 పై స్పందించకపోవటం.. బ్రహ్మాస్త్ర కోసం బిజీ అయిపోవటం సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీసింది. మరి, కేజీఎఫ్ 2పై రాజమౌళి స్పందించకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kamal Haasan: విక్టరీ వెంకటేశ్ పై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్