దివి సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. ఈమె సినిమాలు చేసుకోవడం, సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసుకోవడం తప్ప వేరే లోకం తెలియదు. అలాంటి దివి మీద పోలీసు కేసు పెట్టాలంటూ నెటిజన్ డిమాండ్ చేస్తున్నాడు. అసలు దివి చేసిన నేరం ఏమిటి? ఎందుకు కేసు పెట్టాలని ఆ నెటిజన్ అంటున్నాడు?
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి.. తెలుగులో మహర్షి, జిన్నా, ఏ1 ఎక్స్ ప్రెస్, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోనూ సందడి చేయలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి సినిమా అవకాశాలు రావాలంటే పెద్దల అటెన్షన్ డ్రా చేయాలి కదా. అందుకోసం గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అటెన్షన్ ను డ్రా చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీపై పోలీస్ కేసు పెట్టాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పోలీస్ కేసు పెట్టేంత పెద్ద నేరం ఈ బ్యూటీ ఏం చేసిందబ్బా? అంటే హత్యాయత్నం చేసిందంట. అసలు దివికి, నెటిజన్ కి సంబంధం ఏమైనా ఉందా? హత్యాయత్నం చేయాల్సిన అవసరం దివికి ఎందుకు ఉంటుంది?
అవకాశాల కోసమో, ఆనందం కోసమో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు అప్లోడ్ చేయడం అనేది మామూలే. అందులో మత్తెక్కించే ఫోటోలు ఉంటాయి. గత్తర లేపే గ్లామరసవత్తర ఫోటోలు ఉంటాయి. కూల్ ఫోటోలు ఉంటాయి. పదహారణాల తెలుగమ్మాయిలా రెడీ అయ్యి దిగిన ఫోటోలు ఉంటాయి. గుండెల్లో గునపం దింపే ఘాటు ఫోటోలు ఉంటాయి. నెలవంక నడుముతో నిద్ర చెడగొట్టే ఫోటోలు ఉంటాయి. ఈ క్రమంలో దివి కూడా ఇలాంటి రకరకాల ఫోటోలు అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పొలంలో గ్రామీణ యువతిలా ముస్తాబై ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది.
అసలు సిసలు నాటు అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఎర్ర కోక కట్టి ఎర్రెక్కిస్తోంది. పచ్చని వరి చేనులో కూర్చుని.. కైపెక్కించే అందాలతో గుండెల్లో వలపుల బాణాలు గుచ్చుతోంది. మరి బాణాలు గుచ్చుకుంటే చచ్చిపోతారు కదా. అందుకే ఒక నెటిజన్ తనపై హత్యాయత్నం చేసిందంటూ కామెంట్ చేశాడు. అందంతో హత్యాయత్నానికి పాల్పడిన దివి మీద పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేయాలి అంటూ సదరు నెటిజన్ కామెంట్ చేశాడు. నిజమేనయ్యా పుల్లారావు, ఆ నెటిజన్ అన్న దాంట్లో తప్పు లేదు. దివి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువకులందరినీ అందంతో చంపేస్తుంది అని మీకు కూడా కేసు పెట్టాలని అనిపిస్తుందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.